Spring Onions: ఉల్లికాడలు రుచి కోసం మాత్రమే కాదు.. వీటితో లెక్కలేనన్ని లాభాలు!
ఉల్లి కాడలను చాలా మంది డెకరేషన్ కోసం, వంటల్లో రుచి పెరగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. వీటిల్లో ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. కాబట్టి వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది..
Updated on: Dec 18, 2024 | 4:43 PM

చాలా మంది ఉపయోగించే ఆహారాల్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఒకటి. వీటినే ఉల్లి కాడలు అని కూడా అంటారు. ఈ మధ్య కాలంలో వీటి వాడకం బాగా ఎక్కువగా పెరిగింది. స్ప్రింగ్ ఆనియన్స్‌తో ఎన్నో రుచికరమైన వంటలు తయారు చేస్తూ ఉంటారు. ఉల్లికాడలు తినడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు.

ఉల్లికాడల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉల్లి కాడల్లో ఉండే ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన ఫీల్‌ను అందిస్తుంది. దీంతో ఆకలి అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది. ఉల్లికాడల్లో కేలరీలు సైతం తక్కువగా ఉంటాయి. ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.

ఉల్లికాడల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరకుండా ఉంటుంది. ఉల్లికాడల్లో విటమిన్ కె, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ కె ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది. కాల్షియం ఎముకలను బలపరుస్తుంది.

వీటిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. పొట్టలో గ్యాస్, పుండ్లు, అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. స్టూల్ మూమెంట్ చక్కగా ఉంటుంది. ప్రేగుల్లో ఉండే మలినాలను బయటకు పంపిస్తుంది.

ఉల్లికాడల్లో విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, ఉల్లికాడల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది.





























