- Telugu News Photo Gallery Worlds Popular travel destination in 2024 know Top Destinations in World details here
2024 Year End: 2024లో ప్రపంచంలోని టాప్ 5 ప్రయాణ గమ్యస్థానాలు ఇవే.. మనదేశంలోని ఏ ప్రదేశం ఏ స్థానంలో ఉందంటే
2024 సంవత్సరం ముగియబోతోంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు రాబోయే కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పడానికి ఎదురుచూస్తున్నారు. అంతేకాదు సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేయడం కూడా ప్రారంభించారు. అయితే త్వరలో ముగియబోతున్న 2024 సంవత్సరంలో ప్రపంచంలోని ఏయే ప్రయాణ గమ్యస్థానాలను ప్రజలు ఎక్కువగా ఇష్టపడ్డారో మీకు తెలుసా.. భారతదేశంలో ఏ ప్రదేశం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంది? తెలుసుకుందాం..
Updated on: Dec 18, 2024 | 3:42 PM

2024 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం రానుంది. కొత్త సంవత్సరం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే సంవత్సరానికి వెల్కం చెప్పడానికి రకరకాల ప్రణాళికలను వేయడం ఇప్పటికే ప్రారంభించారు. ముఖ్యంగా నూతన సంవత్సరంలో సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. తమకు ఇష్టమైన ప్రదేశాలను ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రజల ఎంపికలో ఏయే ప్రయాణ గమ్యస్థానాలు టాప్ లో ఉన్నాయంటే..

అమెరికన్ సర్వే ఏజెన్సీ YouGov ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల జాబితాను సిద్ధం చేసింది. YouGov అనేది ఆన్‌లైన్ సర్వే ఏజెన్సీ. ఈ సర్వే సంస్థ ప్రపంచంలోని అనేక దేశాలలో సర్వే నిర్వహించింది. ప్రజలు ఇష్టపడే ప్రదేశాల లిస్టు ను రెడీ చేసింది. ఈ నేపధ్యంలో ప్రపంచంలో అత్యంత ఇష్టపడే ప్రదేశాలు ఏమిటి> భారతదేశంలోని ఏ పర్యాటక ప్రదేశాలను చూడాలని అనుకుంటున్నారు తెలుసుకుందాం..

సహజ చరిత్ర మ్యూజియం: నేచురల్ హిస్టరీ మ్యూజియం లేదా మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ఈ మ్యూజియం ప్రజలకు బాగా నచ్చింది. లండన్ , అమెరికాల్లో మాత్రమే కాదు ఈ మ్యూజియం ప్రపంచంలో అనేక ఇతర ప్రదేశాలలో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ మ్యూజియం భూమికి సంబందించిన 4.6 బిలియన్ సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది. అయితే ఇది చరిత్రతో పాటు రాబోయే 100 సంవత్సరాల భవిష్యత్తును కూడా చూపిస్తుంది.

నయాగరా జలపాతం: నయాగరా జలపాతం అనేది ఉత్తర అమెరికాలో ఉన్న మూడు జలపాతాల సమూహం. ఈ జలపాతం కెనడా , న్యూయార్క్ సరిహద్దులో ఉంది. 160 అడుగుల ఎత్తు నుంచి పడే ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు.

ఎడిన్‌బర్గ్ కోట: స్కాట్లాండ్‌లోని చారిత్రక ఎడిన్‌బర్గ్ కోట ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. రాళ్లను కోసి దీన్ని తయారు చేశారు. ఎడిన్‌బర్గ్ కోట 1633 వరకు రాజభవనంగా ఉండేది. అయితే ఆ తర్వాత 17వ శతాబ్దంలో దీనిని వసతి కోసం మాత్రమే ఉపయోగించడం ప్రారంభించారు.

లండన్ టవర్: లండన్‌లో ఉన్న ఈ ప్రసిద్ధ టవర్ గురించి తెలియని వారు బహు అరుదు అని చెప్పవచ్చు. దీని చరిత్ర అత్యంత పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. ఇది 1066లో స్థాపించబడిందని నమ్ముతారు. 1100 నుంచి 1952 ల వరకూ ఈ కోట జైలుగా ఉపయోగించబడింది.

స్టోన్‌హెంజ్: ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్‌లోని సాలిస్‌బరీ ప్లెయిన్ సమీపంలో ఉన్న ఓ స్మారక కట్టడం. ఇక్కడ రాళ్లను మాత్రమే చూడగలరు. ఈ ఓపెన్ ఎయిర్ మ్యూజియంలో దాదాపు 25 టన్నుల భారీ రాళ్లను ఉంచారు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడ సందర్శించడానికి వస్తారు.

YouGov కి చెందిన Q3 2024 నివేదికలో ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలలో భారతదేశంలోని ఏ ప్రదేశమూ పేరు చోటు చేసుకోలేదు. అయితే ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశంలో టాప్ 50లలో తాజ్ మహల్ 31వ స్థానంలో నిలిచింది.





























