- Telugu News Photo Gallery People with kidney stones should not eat any food, Check Here is Details in Telugu
Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా.. ఈ ఆహారాల జోలికి పోకండి..
ఈ మధ్య కాలంలో కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. వాటిల్లో కిడ్నీల్లో రాళ్లు కూడా ఒకటి. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందికి తెలియక కొన్ని రకాల ఆహారాలు తినేస్తారు. దీని వల్ల ప్రాణాల మీదకు వస్తుంది..
Updated on: Dec 18, 2024 | 1:35 PM

శరీరంలో ముఖ్యమైన అవయవాళ్లలో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలు ఆరోగ్యంగా పని చేస్తేనే బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీల్లో ఎలాంటి మార్పులు వచ్చినా.. ఇతర బాడీ పార్ట్స్‌లో కూడా మార్పులు రావడం ఖాయం. చాలా మంది ఈ మధ్య కాలంలో కిడ్నీల్లో రాళ్లతో బాధ పడుతున్నారు.

కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే రాళ్లు పెరిగి.. ప్రాణానికే ప్రమాదంగా మారతాయి. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. పల్చని మజ్జిగ, బార్లీ నీళ్లు, చియా సీడ్స్ వాటర్, పాల పదార్థాలు వంటివి తీసుకోవడం మంచిది.

అలాగే విటమిన్ బి6 ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇది రాళ్లలో ఉండే ఆక్సలేట్స్‌ని కరిగిస్తాయి. అరటి పండ్లు, అవకాడో, ఓట్స్, సోయా బీన్స్, మామిడి కాయల్లో విటమిన్ బి6 ఉంటుంది. క్యారెట్, కాకర కాయ, పప్పు ధాన్యాలు, బియ్యం వంటివి తీసుకుంటే మంచిది.

కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఇప్పుడు చెప్పే ఆహారాలను అసలు దగ్గరకు కూడా రానివ్వకండి. దీని వలన రాళ్లు అసలు కరగవు. బీట్ రూట్, టమాటా, పాలకూర, క్యాబేజీ, వంకాయ, బంగాళ దుపం, చాక్లెట్స్ వంటివి తినకూడదు.

అలాగే జంక్ ఫుడ్స్, చిప్స్, పచ్చళ్లను దగ్గరకు రానివ్వకండి. మాంసాహార పదార్థాలను కూడా చాలా తక్కువగా తినాలి. సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. ద్రాక్ష పండు జ్యూస్, శీతల పానీయాలు, క్రాన్ బెర్రీ జ్యూస్ తాగకూడదు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























