Black Grapes Benefits: వింటర్‌లో నల్ల ద్రాక్ష తింటే.. శరీరంలో ఏమౌతుందో తెలుసా..?
నల్ల ద్రాక్ష పండ్లు రోజు తినడం వల్ల అనేక రకాల వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు శరీరానికి అనేక రకాలుగా సహాయపడతాయి. నల్ల ద్రాక్షలో ఉండే గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే ఈ చలికాలంలో ద్రాక్ష పండ్లు ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 18, 2024 | 1:25 PM

నల్ల ద్రాక్షలో సీ-విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల చలి కాలం ప్రతి రోజు ఈ ద్రాక్షను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు దరిచేరకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా సీజనల్ వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ద్రాక్షను ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది.

నల్ల ద్రాక్షలో సీ-విటమిన్, ఏ-విటమిన్, బీ6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడుతుంది. నల్లటి ద్రాక్షలు రక్తంలో నైట్రిన్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి, నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఊబకాయంతో బాధపడుతున్నవారు నల్ల ద్రాక్షను తరచుగా తీసుకుంటే.. రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా ఆపుతుంది. ఊబకాయం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. గుండెపోటు నివారణకు దోహదపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. నల్లద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. యవ్వనంగా కనిపించేందుకు దోహదం చేస్తుంది.

ద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి. నలుపు, ఎరుపు, ఆకుపచ్చ వంటి రంగులలో వివిధ దేశాల్లో దర్శనమిస్తాయి. వీటి రుచి కూడా భిన్నంగా ఉంటుంది. ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ బి, కాల్షియం, భాస్వరం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు మొదలైన పోషకాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.





























