TG TET 2024 Exam Schedule: తెలంగాణ టెట్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏయే తేదీలో ఏ పరీక్ష ఉంటుందంటే

తెలంగాణ టెట్ పరీక్షలు మరో 14 రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో బుధవారం టెట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం 20 సెషన్లలో రోజుకు రెండు పూటలా పరీక్షలు జరగనున్నాయి. నార్మలైజేషన్ లేకుండా జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. ఈ మేరకు జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది..

TG TET 2024 Exam Schedule: తెలంగాణ టెట్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏయే తేదీలో ఏ పరీక్ష ఉంటుందంటే
TET Schedule
Follow us
Vidyasagar Gunti

| Edited By: Srilakshmi C

Updated on: Dec 18, 2024 | 4:56 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 18: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 (డిసెంబర్‌) పరీక్షల షెడ్యూల్‌ తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్ 20 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విద్యాశాఖ ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. దీనికి దాదాపు 2,75,773 మంది అభ్యర్థులు తెలంగాణ టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు తెలంగాణ టెట్ ఎక్సమ్ పరీక్షలు జనవరి 2 నుంచి నిర్వహించినట్లు ప్రభుత్వం వెలువరించింది. ఈ టెట్ పరీక్షను జిల్లాల వారీగా పది రోజుల పాటు 20 సెషన్స్‌లో నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా ఒక్కో రోజు ఆయా జిల్లాలో ఉదయం సాయంత్రం రెండు స్టేషన్లలో పరీక్షను నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9.00 నుంచి ఉదయం 11.30 వరకు జరగనుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతుంది.

టెట్‌ 2024 డిసెంబర్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదే

జనవరి 2 తేదీన సోషల్ స్టడీస్ పేపర్ పరీక్ష జనవరి 5 తేదీన సోషల్ స్టడీస్, మాథ్స్ అండ్ సైన్స్ పరీక్ష జనవరి 8, 9, 10 తేదీల్లో లాంగ్వేజ్ పేపర్స్ పరీక్ష జనవరి 11 తేదీన సోషల్ స్టడీస్, మాథ్స్ అండ్ సైన్స్ పరీక్ష జనవరి 12 తేదీన సోషల్ స్టడీస్ పరీక్ష జనవరి 18 తేదీన పేపర్ 1 పరీక్ష జనవరి 19, 20 తేదీలలో మాథ్స్ అండ్ సైన్స్ పరీక్ష

పైన తెలిపిన తేదీల్లో జిల్లాల వారీగా పరీక్షలు నిర్వహిస్తారు. మరిన్ని వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఈ మేరకు అభ్యర్థులు ప్రిపేర్ గా ఉండేలని అధికారులు సూచించారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్ల ను ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు హల్ టికెట్లలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.