Personality Test: ఈ ఫొటోలో ఒక పిల్లిని మీరు సెలెక్ట్ చేసుకుంటే.. మీరెలాంటివారో మేం చెప్పేస్తాం..! ఆర్ యూ రెడీ..
ఎదుటి వారి బలాలు, బలహీణతలు అంచనా వేయడానికి వారి వేషధారణ, వారి కదలికలు, మాటలు.. ఇవి చాలు. ఫుల్ గా స్కాన్ చేసేయొచ్చంటారు మానిసిక నిపుణులు. అలాంటి ఓ స్కానరే ఈ కింది ఫొటో. ఈ ఫొటోలో కనిపిస్తున్న మూడు పిల్లుల్లో మీకు ఏది నచ్చిందో దానిని సెలక్ట్ చేసుకుంటే చాలు. మీ వ్యక్తిత్వం మీ ఆలోచనా విధానం సులువుగా కనిపెట్టేయొచ్చు..
మనసు.. ఇదొక ప్రియమైన శత్రువు. దాని చేతిలో మనం ఉంటే వినాశనం.. మన చేతిలో అది ఉంటే మహారాజయోగం పడుతుంది. కానీ దీనిని అదుపు చేయడం అందరికీ సాధ్యం కాదు. కారణం ముందే చెప్పినట్లు.. అదొక ప్రియమైన శత్రువంతే. మనిషి నడవడిక అతడి మనసుపై ఆధారపడి ఉంటుంది. మనసే మనిషికి మకుటంలేని మహారాజు. మనసు మర్మం తెలిసినవాడే మనసును దారిలో పెట్టగలడు. చంచల స్వభావి అయిన మనసును భక్తి అనే తాడుతో కట్టి పరమాత్మ అనే స్తంభానికి ముడివేయాలంటారు ఋషులు. ఏదీ ఏమైతేనైం మన బుద్ధి, ప్రవర్తన, భవితవ్యం అంతా మనసు, దాని స్థితిగతులపై ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే మీ మనసును ఎదుటి వారు కూడా సులువుగా చదువుతారు. అదెలాగంటారా..? పర్సనాలిటీ టెస్ట్ అందుకు సాధనం. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో చూశారా.. అందులో మూడు పిల్లులు ఉన్నాయి. ఇది పర్సనాలిటీ టెస్ట్ కు సంబంధించిన ఓ విచిత్రమైన ఫోటో. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో రాజదర్పంలో చూస్తున్న బూడిద, నలుపు, తెలుపు రంగుల్లో మూడు విభిన్న పిల్లులు ఉన్నాయి. ఆ మూడు పిల్లులలో ఒకదానిని మీరు ఎంచుకుంటే.. మీ వ్యక్తిత్వం ఎలాంటిదో మేం చెప్పేస్తాం..
గోధుమ రంగు పిల్లి
మీరు గోధుమ రంగు పిల్లిని ఎంచుకున్నట్లయితే.. మీకు మంచి ఆకర్షణ, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీరు మీ సామర్థ్యాల ద్వారా ఇతరులను ప్రేరేపించే వ్యక్తిగా ఉంటారు. సంకోచం లేకుండా రిస్క్‌లను తీసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. టీమ్ లీడర్‌గా జట్టును ప్రోత్సహించగలరు. కానీ కొన్నిసార్లు మీ మితిమీరిన ఉత్సాహం మిమ్మల్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.
నలుపు రంగు పిల్లి
మీరు నలుపు రంగు పిల్లిని ఎంచుకున్నట్లయితే.. మీరు వ్యవస్థీకృత, వ్యూహాత్మక నాయకుడని అర్థం. క్రమశిక్షణ, ప్రశాంతత ద్వారా వ్యవస్థీకృత వాతావరణాన్ని సృష్టించగలరు. అంతేకాకుండా మీ స్థిరమైన మానసిక స్థితి ఒత్తిడిలో కూడా దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడుతుంది.
తెల్ల పిల్లి
మీరు తెలుపు రంగు పిల్లిని ఎంచుకున్నట్లయితే.. మీకు కరుణ, ఇతరులకు సహాయం చేసే నాయకత్వ గుణం కలిగి ఉన్నారని అర్థం. మీరు మీ సానుభూతి, సహకారంతో ఒక బృందాన్ని నిర్మించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి. మీ మాట ఇతరులు వినగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఏ సమస్యనైనా జాగ్రత్తగా పరిష్కరించగలరు. మీలోని ఈ గుణాలే ఇతరులు మిమ్మల్ని నమ్మేలా చేస్తాయి.