Viral: 90 లక్షల మందిని కట్టిపడేసిన  గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.

Viral: 90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Dec 17, 2024 | 5:56 PM

అతనో జంతు సంరక్షకుడు. ఒక ఏనుగు పిల్లను చిన్నప్పటి నుంచీ పెంచుతున్నాడు. ఓ రోజు తాను బయటికి వెళ్లాల్సి వచ్చింది. బైక్‌ పై తీసుకు వెళ్లడానికి ఓ వ్యక్తి వచ్చాడు. కానీ తనను పెంచిన వ్యక్తిని పోనివ్వకుండా.. ఆ గున్న ఏనుగు మారాం చేసింది. అంతా ఇంతా కాదు.. అతడిని గట్టిగా పట్టుకుని ఉండిపోయింది. తాను విడిపించుకుని బైక్‌ ఎక్కబోతుంటే అడ్డుపడి ఆపింది. చివరికి ఆ బైక్‌పై వచ్చిన వ్యక్తి బైక్‌ ను ఈ జంతు సంరక్షకుడికి ఇచ్చి.. తాను కిందికి దిగాడు.

గున్న ఏనుగు తన తొండంతో అతడిని పట్టుకుని బైక్‌ నుంచి దింపేసి తన వెంట తీసుకుపోయింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ గా మారింది. పోస్టు చేసిన ఒక్క రోజులోనే 9 మిలియన్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. వేల కొద్దీ లైకులు, షేర్లు నమోదవుతున్నాయి. ఏమైనా ఏనుగు మారాం మామూలుగా లేదంటూ ఈ వీడియోకు కామెంట్లు వస్తున్నాయి. ఏదైనా పెంచిన ప్రేమ వదలడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏనుగు తీరు ముచ్చటగా ఉందని కామెంట్‌ చేస్తున్నారు.

సరిగ్గా ఇలాగే బెంగళూరులోని బన్నేరుగట్ట నేషనల్‌ పార్క్‌లో సావిత్రమ్మ ప్రేమ, ఆప్యాయతల ముందు పులులు కూడా చంటి పిల్లల్లా మారిపోవడం చూశారు. ఆమె బుగ్గపై ముద్దులు పెడుతూ చిన్న పిల్లల్లా ఆమె చుట్టూ తిరుగుతుంటాయి. 2002లో భర్త చనిపోయాక సావిత్రమ్మ ఈ పార్కులో క్లీనింగ్ సిబ్బందిగా జాయిన్ అయ్యింది. అయితే ఆమె జంతువుల పట్ల చూపెడుతున్న ప్రేమానురాగాలను గుర్తించిన అధికారులు ఆమెను జూ హాస్పిటల్ కేర్ టేకర్ గా ప్రమోట్ చేశారు. ఇక్కడే ఆమె గాయాలపాలైన లేక తల్లిని పోగొట్టుకున్న పులి పిల్లలను ప్రేమగా చూసుకుంటుంది. అచ్ఛం కన్నతల్లిలా చూసుకుంటూ ఆ జంతువులకు తల్లిగా మారింది. కేజ్ లోకి ఆమె రాగానే పులి పిల్లలు ఆమె చుట్టూ చేరి నానా అల్లరి చేస్తుంటాయి. సావిత్రమ్మ వాటిని పేర్లతో పిలుస్తూ ఆలనాపాలనా చూస్తుంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.