కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.

కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Dec 17, 2024 | 6:09 PM

అడవిలో సింహాలకు ఎదురులేదు. ఎలాంటి జంతువైనా సింహాన్ని చూస్తే భయంతో వణికిపోతుంది. దానికి ఎదురెళ్లే సాహసం చేయవు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇలాంటి సింహాలు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. పాములు, ఏనుగులు, ఎలుగుబంట్ల రూపంలో షాక్‌లు తగులుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం.

సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అడవిలోని రోడ్డు పక్కన ఉన్న ఓ సింహానికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అటుగా వచ్చిన ఓ పెద్ద కొండచిలువ ఊహించని విధంగా సింహంపై దాడి చేసింది. సింహాన్ని నోట చిక్కించుకోవడానికి దాన్ని చుట్టేసింది. కొండచిలువ అనూహ్య దాడితో సింహం షాక్ అయింది. దాన్నుంచి విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. కొండచిలువ మాత్రం ఎంతో చాకచక్యంగా సింహం మెడను చుట్టేసింది. మెడ వద్ద గట్టిగా పట్టేసుకోవడంతో సింహం విలవిల్లాడిపోయింది. ఎంత ప్రయత్నించినా కొండచిలువ మాత్రం సింహాన్ని వదల్లేదు. ‘‘ఈ రోజు ఎలాగైనా నిన్ను వదిలేదు లేదు’’.. అన్నట్లుగా సింహాన్ని రౌండ్లు రౌండ్లు చుట్టేసి కిందపడేసేందు ప్రయత్నించింది. అయితే చివరకు ఎలాగోలా ఆ సింహం.. కొండచిలువ నుంచి తప్పించుకుంది. సింహాన్ని వదిలేసిన కొండచిలువ తర్వాత మెల్లగా దాని దారిన అది వెళ్లిపోయింది.

ఈ ఘటన మొత్తం ఆఫ్రికాలో పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహానికి చుక్కలు చూపించిన కొండచిలువ’’.. అంటూ కొందరు, ‘‘కొండచిలువ పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.