Heroine Beauty Secrets: స్పెర్మ్‌తో ఫేషియల్.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
ప్రస్తుతం వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి స్పెషల్ అకేషన్ లో ఎవరికైనా స్పెషల్ గా కనిపించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు.. అందరిలోనూ తాము అందంగా, స్పెషల్ గా కనిపించాలని అనుకుంటారు. దానికోసం ఫంక్షన్ కి మందు... బ్యూటీ పార్లర్ ల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. గంటలు తరపడి.. వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఫేషియల్స్ చేయించుకుంటారు. వాటి గ్లో ఒక్క రోజు మాత్రమే ఉంటుంది.
ఇక లేటెస్ట్‌గా వినిపిస్తున్న మాట స్పెర్మ్‌తో ఫేషియల్. ప్రస్తుతం చర్మ సౌందర్యం కోసం చేసే వివిధ ప్రక్రియల్లో స్పెర్మ్ ఫేషియల్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఫేషియల్ చేయడానికి ముందు మొదట చర్మాన్ని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఎక్స్‌ఫోలియేషన్ లైట్ స్ర్కబ్బింగ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తారు. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల స్కిన్ టోన్ కూడా మెరుగవుతుంది. చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ముఖం, కళ్లు ఉబ్బిపోతుంటాయి. అలాంటి సమయంలో ఫేషియల్ చేస్తే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. మొటిమలతో ఇబ్బంది పడేవారికి ఫేషియల్ బాగా పనిచేస్తుంది. మొటిమల వల్ల కలిగే వాపుని, రెడ్‌నెస్‌ను తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుందని అంటున్నారు.
ఇక స్పెర్మ్‌తో ఫేషియల్.! ఛీఛీ.. ఏంటిదీ.. వినడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదూ! ఈమధ్య ఓ టీవీ షోలో హాలీవుడ్ అందాల నటి కిమ్ కర్దాషియాన్..‘నా చర్మ సౌందర్య రహస్యం స్పెర్మ్ ఫేషియల్’ అని చెప్పినప్పుడు కూడా అందరూ అలానే నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ స్పెర్మ్‌ను ఎక్కడినుంచి సేకరిస్తారో తెలుసా… ప్రత్యేకంగా పెంచిన సాల్మన్ చేపల నుంచి. వాటి వీర్యంతోను, అందులోంచి సేకరించిన డీఎన్‌ఏతోనూ రకరకాల సౌందర్యోత్పత్తుల్నీ తయారు చేస్తున్నాయి కొన్ని సంస్థలు. చర్మాన్ని బిగుతుగానూ, యవ్వనంగానూ మార్చడానికి- పలు రసాయనాలతో చేసే బొటాక్స్ ఇంజక్షన్లను వాడుతుంటారు చాలామంది. అయితే ఈ స్పెర్మ్ ఫేషియల్స్, ఫిల్లర్స్ ఇప్పుడు ఆ బొటాక్స్‌కు ప్రత్యామ్నాయంగా మారాయట. మనదేశంలో కూడా అందుబాటులో ఉన్న ఈ ఫేషియల్ ధర యాభై వేలకు పైమాటే మరి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.