షాకిచ్చిన అశ్విన్.. కెరీర్ గణాంకాలు చూస్తే ఔరా అనాల్సిందే 

TV9 Telugu

18 December 2024

బంతిని మెలికలు తిప్పి, మరిచిపోలేని విజయాలను సాధించిపెట్టిన అశ్విన్‌ విన్యాసాలు, ఇక ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో చూడలేం. టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందు, అశ్విన్, కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగంగా కలిసి హాగ్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

2009లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన టీమిండియా ఆల్ రౌండర్ ఆర్ అశ్విన్.. 15ఏళ్ల కెరీర్‌లో 106 టెస్ట్‌లు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు.

ఆర్ అశ్విన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు తన పేరుతో లిఖించుకున్నాడు.

ఎన్నో ఓడిపోయిన మ్యాచ్‌లను గెలిపించాడు. డ్రాగా ముగించాడు.  టెస్టుతోపాటు వన్డే క్రికెట్‌లోనూ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

టీమిండియా తరపున టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు రవిచంద్రన్ అశ్విన్. టెస్టుల్లో 6 సెంచరీలు, 14 హాఫ్‌సెంచరీలతో 3, 503 పరుగులు చేశాడు అశ్విన్. 

2010లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు అశ్విన్.. 2011లో వెస్టిండీస్‌పై టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన అశ్విన్‌.. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడాడు.

ఇన్ని రోజులు టీమిండియాకు అందించిన సేవలకు కృతజ్ఞత అంటూ BCCI ఎమోషనల్ పోస్టుపెట్టింది. ఓ మంచి ఆల్‌రౌండర్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడని ఎక్స్‌లో పోస్టు చేసింది.