Jack Movie: సిద్ధు జొన్న‌లగ‌డ్డ ‘జాక్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ పాన్ ఇండియా హీరో సినిమా వాయిదా పడినట్లేనా?

టిల్లు స్క్వేర్ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు స్టార్ బాయ్ సిద్దూ జొన్నల గడ్డ. దీంతో ఈ యంగ్ హీరో తర్వాతి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమాతో బిజి బిజీగా ఉంటున్నాడీ యంగ్ హీరో.

Jack Movie: సిద్ధు జొన్న‌లగ‌డ్డ ‘జాక్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఆ పాన్ ఇండియా హీరో సినిమా వాయిదా పడినట్లేనా?
Siddhu Jonnalagadda Jack Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 18, 2024 | 4:35 PM

సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ అంటూ యూత్, మాస్ ఆడియెన్స్‌లో క్రేజీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈయ‌న క‌థాయ‌కుడిగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బివిఎస్ఎన్‌ ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. కీలక పాత్రలో ప్ర‌కాష్ రాజ్‌, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పైగానే పూర్త‌య్యింది. శరవేగంగా షూటింగ్ చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారు. సమ్మర్ కానుకగా రాబోతోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఈ చిత్రంలో సిద్దు పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోంది. పూర్తి వినోదాత్మకంగా రాబోతోన్న ఈచిత్రానికి అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రమోషన్స్‌లో యూనిట్ ప్రారంభించనుంది.

ఇవి కూడా చదవండి

కాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘ ది రాజాసాబ్’ సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి. ఈ విషయాన్ని ఇదివరకే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే గత కొన్ని రోజులుగా ది రాజా సాబ్ రిలీజ్ వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా ఏ విషయాన్ని ప్రకటించలేదు కానీ.. ఇప్పుడు దాదాపు వాయిదా కన్ఫర్మ్ అయినట్లే. ఎందుకంటే ఇప్పుడు సిద్ధు జొన్నల్లగడ్డ.. అదే తేదీకి తన కొత్త సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.

నెక్ట్స్ లెవెల్ ఎంటర్ టైన్మెంట్ తో ..

ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా వాయిదా పడినట్టేనా?

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.