AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: లాంగ్ బ్రేక్‌తో ఇంటికొచ్చాడు.. కట్‌చేస్తే.. రీఎంట్రీతో మనోడి కెరీర్ క్లోజ్..?

Mohammed Siraj Bowling Speed: దులీప్ ట్రోఫీ ఫైనల్లో మొహమ్మద్ సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు వేసి 140 పరుగులు ఇచ్చినా వికెట్ తీయలేకపోయాడు. సాధారణ వేగానికి భిన్నంగా 125-130 kmphలకే పరిమితమయ్యాడు. రెండు నెలల విరామం తర్వాత నేరుగా మ్యాచ్ ఆడటంతో రిథమ్‌ దెబ్బతిందని సిరాజ్ స్వయంగా వెల్లడించాడు.

Team India: లాంగ్ బ్రేక్‌తో ఇంటికొచ్చాడు.. కట్‌చేస్తే.. రీఎంట్రీతో మనోడి కెరీర్ క్లోజ్..?
Mohammed Siraj Bowling Speed
Venkata Chari
|

Updated on: Sep 11, 2026 | 5:16 PM

Share

Mohammed Siraj Bowling Speed: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తరపున బరిలోకి దిగిన మొహమ్మద్ సిరాజ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. 25 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను 140 పరుగులు సమర్పించుకున్నా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ముఖ్యంగా అతని వేగం 125-130 kmph మధ్యే ఉండటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా 135-140 kmph, కొన్నిసార్లు 145 kmph వరకు వేగం అందుకునే సిరాజ్ ఈసారి భిన్నంగా కనిపించాడు.

రిథమ్‌పై ప్రభావం..

శ్రీలంక పర్యటనలోనూ సిరాజ్ వేగం తగ్గడం కనిపించింది. కోలంబో టెస్టులో అతని బౌలింగ్‌పై ఇదే అంశం చర్చకు వచ్చింది. అయితే దులీప్ ట్రోఫీ ఫైనల్ తర్వాత సిరాజ్ తన పరిస్థితిపై స్పష్టత ఇచ్చాడు. సుమారు రెండు నెలల విరామం తర్వాత నేరుగా మ్యాచ్ ఆడటంతో పూర్తిస్థాయి రిథమ్‌ అందుకోలేకపోయానని తెలిపాడు.

ఎక్కువమంది చదివినది: బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..!

ఇవి కూడా చదవండి

రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్నా..

తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ బౌలింగ్‌లో స్పష్టమైన మెరుగుదల కనిపించింది. లైన్ మరింత కచ్చితంగా సాగింది. 16 ఓవర్లు వేసిన అతను కేవలం 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. దీంతో మ్యాచ్ సాగుతున్న కొద్దీ తన పాత రిథమ్‌ను తిరిగి అందుకుంటున్న సంకేతాలు కనిపించాయి.

మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి..

ఐపీఎల్ 2026 తర్వాత జూన్‌లో భారత్-అఫ్గానిస్థాన్ ఏకైక టెస్టులో సిరాజ్ ఆడాడు. ఆ తర్వాత రెండు నెలలకుపైగా మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను ఆగస్టు 19న భారత్-శ్రీలంక టెస్టుతో తిరిగి వచ్చాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే వన్డే సిరీస్‌లో సిరాజ్ కనిపించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ముందు దులీప్ ట్రోఫీలో తిరిగి రిథమ్‌ సాధించడం అతనికి కీలకంగా మారింది.

ఎక్కువమంది చదివినది: Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us