AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాస్‌పోర్ట్ లేదు.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్.. బైక్‌పై వెతికిన మరీ ఇంగ్లాండ్ పట్టుకొచ్చిన పాక్ కోచ్.. ఎందుకో తెలుసా?

Razaullah Test Debut: పాకిస్థాన్ యువ పేసర్ రజౌల్లా టెస్టు అరంగేట్రం వెనుక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ఎంపికైనప్పుడు అతడి వద్ద పాస్‌పోర్ట్ లేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో కోచ్ బైక్‌పై వెళ్లి అతడిని వెతికి పట్టుకున్నాడు. చివరకు ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి టెస్టు వికెట్‌గా జో రూట్‌ను పడగొట్టాడు.

పాస్‌పోర్ట్ లేదు.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్.. బైక్‌పై వెతికిన మరీ ఇంగ్లాండ్ పట్టుకొచ్చిన పాక్ కోచ్.. ఎందుకో తెలుసా?
Razaullah Test Debut
Venkata Chari
|

Updated on: Sep 10, 2026 | 8:51 PM

Share

Razaullah Test Debut: పాకిస్థాన్ యువ ఫాస్ట్ బౌలర్ రజౌల్లా టెస్టు అరంగేట్రం స్టోరీ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు అతడిని ఎంపిక చేసినప్పుడు రజౌల్లా వద్ద పాస్‌పోర్ట్ లేదు. అంతేకాదు, అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో జట్టు నుంచి నేరుగా సంప్రదించడం సాధ్యం కాలేదంట.

బైక్‌పై కోచ్ వెతుకులాట..

పాకిస్థాన్ జట్టులో చోటు దక్కిందనే విషయాన్ని రజౌల్లాకు చెప్పేందుకు కోచ్ స్వయంగా అతడిని వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. బైక్‌పై వెళ్లి అతడిని గుర్తించిన తర్వాతే ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరే ఏర్పాట్లు మొదలయ్యాయి. అత్యవసరంగా పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియ పూర్తి చేసి రజౌల్లాను జట్టుతో కలిపారు.

నేరుగా ప్లేయింగ్‌ XIలోకి..

ఎడ్జ్‌బాస్టన్‌లో సెప్టెంబర్ 9న ప్రారంభమైన ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ 3వ టెస్ట్ (England vs Pakistan 3rd Test)లో రజౌల్లాకు తుది జట్టులోనే అవకాశం దక్కింది. 21 ఏళ్ల ఈ పేసర్‌కు ఇదే తొలి టెస్టు. తొలి మ్యాచ్‌లోనే అతడు తన ఎంపికను సమర్థించే ప్రదర్శన ఇచ్చాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి, టెస్టు కెరీర్‌లో తొలి వికెట్‌ను నమోదు చేశాడు.

రూట్ తర్వాత మరో వికెట్..

రజౌల్లా అక్కడితో ఆగలేదు. ఇంగ్లాండ్ ఓపెనర్ ఎమిలియో గేను కూడా అతడే పెవిలియన్‌కు పంపాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి రజౌల్లా 9 ఓవర్లలో 42 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా 23 ఓవర్లు వేసిన రజౌల్లా 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ 453 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగుల ఆధిక్యం సాధించింది.

తొలి మ్యాచ్‌లోనే సంచలనం..

పాకిస్థాన్ రెండు టెస్టుల్లో ఓటముల తర్వాత జట్టులో భారీ మార్పులు చేసింది. ఈ క్రమంలో రజౌల్లాతో పాటు పలువురు కొత్త ఆటగాళ్లకు అవకాశం వచ్చింది. అయితే పాస్‌పోర్ట్ లేకపోవడం, ఫోన్ అందుబాటులో లేకపోవడంతో కోచ్ బైక్‌పై వెతకాల్సి రావడం నుంచి.. తొలి టెస్టులోనే జో రూట్ వికెట్ తీయడం వరకు రజౌల్లా ప్రయాణం అనూహ్య మలుపులతో సాగింది. అతడి టెస్టు అరంగేట్రం పాకిస్థాన్‌కు తొలి రోజు ఆటలో చెప్పుకోదగ్గ అంశంగా నిలిచింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాస్‌పోర్ట్ లేదు.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్.. బైక్‌పై వెతికిన కోచ్
పాస్‌పోర్ట్ లేదు.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్.. బైక్‌పై వెతికిన కోచ్
పెళ్లి ఆలస్యమవుతున్నవారు తప్పక చేయాల్సిన పరిహారమిది!
పెళ్లి ఆలస్యమవుతున్నవారు తప్పక చేయాల్సిన పరిహారమిది!
సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారా? జైలుకే.. తస్మాత్‌..!
సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారా? జైలుకే.. తస్మాత్‌..!
వామ్మో.. వర్కౌట్‌ చేసేవారు నీళ్లు ఇలా తాగితే ప్రమాదమే!
వామ్మో.. వర్కౌట్‌ చేసేవారు నీళ్లు ఇలా తాగితే ప్రమాదమే!
ప్రేమ వివాహానికి అడ్డొచ్చిందని ప్రియురాలి తల్లి కుట్ర..దారుణ హత్య
ప్రేమ వివాహానికి అడ్డొచ్చిందని ప్రియురాలి తల్లి కుట్ర..దారుణ హత్య
జాతకం మారబోతుంది.. గెట్ రెడీ అంటున్న సూర్యుడు.. వీరికి తిరుగుడదు
జాతకం మారబోతుంది.. గెట్ రెడీ అంటున్న సూర్యుడు.. వీరికి తిరుగుడదు
గురు చండాల దోషం నుంచి విముక్తి.. వీరికి ఇక తిరుగే ఉండదు
గురు చండాల దోషం నుంచి విముక్తి.. వీరికి ఇక తిరుగే ఉండదు
ఈ టిప్స్ తెలిస్తే ఎంత రద్దీ ఉన్నా మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్!
ఈ టిప్స్ తెలిస్తే ఎంత రద్దీ ఉన్నా మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్!
అబ్బబ్బా.. అదృష్టం అంటే వీరిదే గురూ..శుక్రుడి మార్పుతో లక్కేలక్కు
అబ్బబ్బా.. అదృష్టం అంటే వీరిదే గురూ..శుక్రుడి మార్పుతో లక్కేలక్కు
ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశాక ఒంటరిగా పడుకోవాలంటే భయపడతారు
ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశాక ఒంటరిగా పడుకోవాలంటే భయపడతారు