బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..!
Finn Allen Melbourne Stars: బిగ్ బాష్ లీగ్‌లో ఫిన్ అలెన్ కోసం మెల్‌బోర్న్ స్టార్స్ భారీ ఒప్పందం చేసుకుంది. పర్థ్ స్కార్చర్స్‌ను గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిపిన న్యూజిలాండ్ ఓపెనర్‌ను మూడు సంవత్సరాలకు సొంతం చేసుకుంది. తొలి ఏడాది సుమారు 6 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల పారితోషికం అందుకోనున్న అలెన్.. BBLలోనే అత్యంత ఖరీదైన డీల్‌గా నిలిచాడు.

Finn Allen Melbourne Stars: బిగ్ బాష్ లీగ్‌లో (Big Bash League (BBL)) లో సంచలన మార్పు చోటుచేసుకుంది. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ ఫిన్ అలెన్ను మెెల్‌బోర్న్ స్టార్స్ భారీ మొత్తానికి జట్టులోకి తీసుకుంది. మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్న ఈ డీల్.. బీబీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కాంట్రాక్ట్‌గా నిలిచింది. గత సీజన్‌లో పర్థ్ స్కార్చర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకంగా నిలిచిన అలెన్ ఇప్పుడు అదే జట్టుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు.
తొలి ఏడాదే రూ.4 కోట్లకు పైగా..
అలెన్‌కు తొలి సీజన్‌లో సుమారు 6 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు అందనున్నాయి. భారత కరెన్సీలో ఇది రూ.4 కోట్లకు పైగా. విదేశీ ఆటగాళ్ల డ్రాఫ్ట్ విధానాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) తొలగించిన తర్వాత ఫ్రాంచైజీలకు సాలరీ క్యాప్ విషయంలో మరింత వెసులుబాటు వచ్చింది. దీంతో అలెన్ కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ పెరిగింది.
స్కార్చర్స్‌కు భారీ దెబ్బ..
గత సీజన్‌లో పర్థ్ స్కార్చర్స్ టైటిల్ గెలవడంలో అలెన్ కీలక పాత్ర పోషించాడు. అయితే డ్రాఫ్ట్ వ్యవస్థ మారడంతో స్కార్చర్స్‌కు అతడిని రిటైన్ చేసుకునే పాత హక్కు లేకుండా పోయింది. ఈ అవకాశాన్ని మెల్‌బోర్న్ స్టార్స్ అందిపుచ్చుకుంది. కొత్త హెడ్ కోచ్ కామెరన్ వైట్తో అలెన్‌కు గతంలోనే పరిచయం ఉంది. MLCలో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ తరఫున అతడు రెండు సీజన్లు ఆడాడు.
టీ20లో విధ్వంసక బ్యాటర్..
ఫిన్ అలెన్ ప్రస్తుతం ప్రపంచంలోని ప్రమాదకరమైన టీ20 బ్యాటర్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. గత సీజన్‌లో పర్థ్‌కు టైటిల్ అందించిన తర్వాత టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో కేవలం 33 బంతుల్లో నాటౌట్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత IPLలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున తన తొలి సెంచరీ కూడా నమోదు చేశాడు.
అయితే ఈ రికార్డు డీల్‌తో బీబీఎల్ శాలరీలపై చర్చ మొదలైంది. మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్ మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి ఆస్ట్రేలియా ఆటగాళ్లు లీగ్‌తో చాలాకాలంగా కొనసాగుతున్నప్పటికీ, వారి పారితోషికం కొందరు విదేశీ ఆటగాళ్ల కంటే తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంతకుముందు అడిలైడ్ స్ట్రైకర్స్ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను 5 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లకు తీసుకుంది.
