AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. ఆ విషయంలో ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌‌గా..

Virat Kohli: సమకాలీన క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని రారాజు విరాట్ కోహ్లీ(Virat Kohli). కొంతకాలంగా  పరుగులు సాధించడంలో ఇబ్బంది పడుతున్నా అతని బ్రాండ్ వ్యాల్యూ కానీ..

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. ఆ విషయంలో ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌‌గా..
Virat Kohli
Venkata Chari
| Edited By: Basha Shek|

Updated on: Jun 08, 2022 | 8:41 PM

Share

Virat Kohli: సమకాలీన క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని రారాజు విరాట్ కోహ్లీ(Virat Kohli). కొంతకాలంగా  పరుగులు సాధించడంలో ఇబ్బంది పడుతున్నా అతని బ్రాండ్ వ్యాల్యూ కానీ, అతనిపై ఉన్న అభిమానం కానీ ఏ మాత్రం తగ్గడంలేదు. త్వరలోనే తమ అభిమాన ఆటగాడు ఫామ్ లోకి వస్తాడని, మునపటిలాగే  మళ్లీ పరుగుల వరద పారిస్తాడని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో కోహ్లీ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  నెట్టింట్లో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ రన్ మెషిన్ తరచూ తన మ్యాచ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటాడు. అదేవిధంగా తోటి ఆటగాళ్లతో సరదాగా గడిడిన ఫొటోలు,  సతీమణి అనుష్క శర్మతో కలిసి దిగిన ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటాడు. వీటికి అభిమానులు, నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో కోహ్లీకి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడుతోంది. మైదానంలో పరుగలు చేసినా, చేయకపోయినా నెట్టింట్లో కోహ్లీ క్రేజ్ బాగా పెరిగిపోతోంది. రోజురోజుకీ అతని ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. తాజాగా  ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ ను అనుసరించే వారి సంఖ్య 200 మిలియన్లకు చేరుకుంది (Virat Kohli Instagram Followers). తద్వారా ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుల కెక్కాడు.  ఈ విషయాన్ని తనే ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడీ రన్ మెషిన్.

200 మిలియన్ల స్ట్రాంగ్ నెస్..

ఇవి కూడా చదవండి

‘200 మిలియన్స్  స్ట్రాంగ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మద్దతు ఇస్తోన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేసిన కోహ్లీ  అందులో తన క్రికెట్ కెరీర్ కు సంబంధించిన  అరుదైన ఫొటోలు, వీడియోలను పంచుకున్నాడు. కాగా ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుల్లో లియోనల్‌ మెస్సీ(451 మిలియన్లు), క్రిస్టియానో రొనాల్డో (334 మిలియన్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  ఇక కోహ్లి తర్వాత 175 మిలియన్ల మంది ఫాలోవర్లతో బ్రెజిలియన్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్మార్ ఉన్నాడు.

మైదానంలోనూ సెంచరీ కొట్టాలని..

ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లో విరాట్ పెద్దగా పరుగులేమీ చేయలేదు. ఈ సీజన్‌లో కోహ్లీ 16 మ్యాచ్‌ల్లో కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఈక్రమంలోనే దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు.   కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి డబుల్ సెంచరీ కొట్టినట్లుగానే , అతని బ్యాట్  సెంచరీలు జారువారాలని అభిమానులు ఆశిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Harmanpreet Kaur: మిథాలీ రాజ్‌ రిటైర్మెంట్‌.. శ్రీలంకతో సిరీస్‌కు కొత్త కెప్టెన్‌గా హర్మన్‌ ప్రీత్‌..

IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌.. టీ20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్, కుల్దీప్‌ ఔట్.. కెప్టెన్‌ ఎవరంటే..