Viral Photo: రిషబ్ పంత్‌ను కలిసిన టీమిండియా సిక్సర్ల కింగ్.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటో..
Yuvraj Singh: భారత జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను కలిసిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్.. ప్రస్తుతం ఆ ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. అయితే అభిమానులకు మాత్రం సోషల్ మీడియాలో తన హెల్త్ అప్‌డేట్స్ అందిస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 16 సాయంత్రం, మాజీ భారత ఆటగాడు యువరాజ్ సింగ్ రిషబ్ పంత్‌ను కలిసిన ఫొటో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.
రిషబ్ పంత్ బుధవారం సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నాడు. అందులో అతను కర్ర సహాయంతో పూల్ లోపల నడుస్తున్నట్లు కనిపించాడు. అదే సమయంలో పంత్‌ను యువరాజ్ సింగ్ కలిశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు అద్భుతమైన క్యాప్షన్ కూడా అందించాడు. ఈ ఛాంపియన్ మళ్లీ ఎదుగుతున్నాడని యువరాజ్ రాసుకొచ్చాడు.
పంత్ పూర్తిగా ఫిట్‌గా ఉండటానికి చాలా సమయం పట్టవచ్చు. గత ఏడాది బంగ్లాదేశ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే పంత్ భారత్‌కు తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతను కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ మోకాలి శస్త్రచికిత్స తర్వాత, అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అప్పటి నుంచి కోలుకుంటున్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉన్నాడు.
View this post on Instagram
ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా డేవిడ్ వార్నర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్‌లో రిషబ్ పంత్ ఆడకపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు. ఫ్రాంచైజీ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ను రాబోయే సీజన్‌లో జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించింది. అదే సమయంలో, అక్షర్ పటేల్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత, వార్నర్ కూడా జట్టులో పంత్ లేని లోటును తీరుస్తానని చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..