IND vs AUS: 1268 రోజుల్లో కేవలం 3 మ్యాచ్‌లు.. కట్ చేస్తే.. 4వ వన్డే తర్వాత మారిన లక్.. నేడు విధ్వంసం సృష్టించేందుకు రెడీ..
India Vs Australia ODI Series: భారత్, ఆసీస్ వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. 1268 రోజుల్లో కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడిన బ్యాట్స్‌మెన్.. నేడు విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.
భారత్, ఆస్ట్రేలియా జట్లు నేటి నుంచి మరోసారి ముఖాముఖిగా తలపడనున్నాయి. ఈసారి ఇరుజట్లు వన్డే సిరీస్‌లో తలపడుతున్నాయి. తొలి మ్యాచ్ ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే, 1268 రోజుల్లో కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడిన బ్యాట్స్‌మెన్ విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ ప్లేయర్ జనవరి 31, 2019న వన్డే అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 21 జులై 2022 వరకు అతను మరో 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. ఈ రెండు తేదీల మధ్య రోజుల గ్యాప్ 1268 రోజులు. ఈ కాలంలో కేవలం 3 ODIలు మాత్రమే ఆడిన వ్యక్తిగా శుభమాన్ గిల్ నిలిచాడు.
అందరికీ రెండో అవకాశం వస్తుందని అంటున్నారు. 1268 రోజుల తర్వాత, శుభ్‌మాన్ గిల్‌కి కూడా ఈ అవకాశం వచ్చింది. అతను 22 జులై 2022న 4వ వన్డే ఆడాడు. అయితే, ఆ తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
గిల్ తన మొదటి 3 ODIలలో చేయలేనిది.. నాలుగో వన్డేలో చేశాడు. 4వ వన్డేలో 15 ఎక్కువ పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో 64 పరుగులు చేశాడు. కాగా, తొలి 3 వన్డేల స్కోరు 49 పరుగులు మాత్రమే.
గిల్ 22 జులై 2022 నుంచి ఆడిన 18 ODIల్లో 86.07 సగటుతో 4 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలతో సహా 1205 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ల గురించి చెప్పాలంటే, ఈ కాలంలో మరెవరూ 684 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు.
ఈరోజు గిల్ ఆస్ట్రేలియాకు పెను ముప్పుగా మారనున్నాడని, టీమిండియాకు కీలక ఆయుధంగా మారనున్నాడని స్పష్టం అవుతోంది. దీనికి మరో కారణం 2023లో గిల్ బలమైన ప్రదర్శనతో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఇన్నింగ్స్‌లలో 71 సగటుతో శుభ్‌మన్ గిల్ 935 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు నమోదయ్యాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..