IND vs AUS: వన్డేల్లో అత్యధిక పరుగులతో సత్తా చాటిన 4గురు.. ఆస్ట్రేలియా సిరీస్‌లో అందరి దృష్టి వీరిపైనే..
India vs Australia: భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో అందరి చూపు ఈ 4గురు ఆటగాళ్లపైనే ఉంటుంది. ఎందుకంటే 2023లో అత్యధిక పరుగులు చేసిన లిస్టులో వీరున్నారు.
IND vs AUS: భారత క్రికెట్ జట్టు నేటి (మార్చి 17) నుంచి ఆస్ట్రేలియాతో ODI సిరీస్ ఆడనుంది. ఈ వన్డే సిరీస్ ద్వారా భారత జట్టు 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమవుతోంది. భారత జట్టు ప్రపంచ కప్‌కు అత్యుత్తమ జట్టును తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం జట్టు మేనేజ్‌మెంట్ ప్రస్తుత ఫామ్‌తో ఉన్న ఆటగాళ్లపై ఖచ్చితంగా నిఘా ఉంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2023లో ఇప్పటివరకు ODI ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్స్ వీరే..
శుభ్‌మన్ గిల్: ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 6 ఇన్నింగ్స్‌ల్లో 113.40 సగటుతో శుభ్‌మన్ గిల్ అత్యధికంగా 567 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 3 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీని బాదేశాడు.
విరాట్ కోహ్లీ: ఈ జాబితాలో విరాట్ కోహ్లి పేరు రెండవ స్థానంలో ఉంది. గత కొన్నాళ్లుగా విరాట్ బ్యాడ్ ఫామ్ కారణంగా చర్చల్లో నిలుస్తున్నాడు. కానీ, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. 2023లో భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ 6 వన్డేల్లో 67.60 సగటుతో 338 పరుగులు చేశాడు. విరాట్ రెండుసార్లు సెంచరీ ఇన్నింగ్స్ కూడా ఆడాడు.
రోహిత్ శర్మ: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. అతను ఈ సంవత్సరం వన్డే ఫార్మాట్‌లో 6 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 54.66 సగటుతో 328 పరుగులు చేశాడు. ఈ సమయంలో, రోహిత్ 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడాడు.
హార్దిక్ పాండ్యా: ఈ జాబితాలో భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు కూడా చేరింది. పాండ్యా ఈ ఏడాది 4 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడాడు. 33 సగటుతో 132 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఒకసారి అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవరు నిలుస్తారనేది చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..