- Telugu News Photo Gallery Cricket photos Ind vs aus team india fast bowler mohammed siraj most wickets in the powerplay of odis since 2022 check stats records
IND vs AUS: 15 నెలల్లో 25 మంది బలి.. పవర్ ప్లేలో హైదరాబాదీ పేసర్ బీభత్సం.. లెక్కలు చూస్తే ప్రత్యర్థులకు వణుకే..
వన్డే క్రికెట్‌కు 50 ఓవర్లు ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే, హైదరాబాదీ పేసర్ మాత్రం మొదటి 10 ఓవర్లలోనే ప్రత్యర్థుల తాట తీస్తూ లెక్కలు మార్చేస్తున్నాడు. గత 15 నెలల్లో పవర్‌ప్లేలో 25 వన్డే వికెట్లు పడగొట్టి, సత్తా చాటాడు.
Updated on: Mar 17, 2023 | 10:27 AM

వన్డే క్రికెట్‌కు 50 ఓవర్లు ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే, హైదరాబాదీ పేసర్ మాత్రం మొదటి 10 ఓవర్లలోనే ప్రత్యర్థుల తాట తీస్తూ లెక్కలు మార్చేస్తున్నాడు. గత 15 నెలల్లో పవర్‌ప్లేలో 25 వన్డే వికెట్లు పడగొట్టి, సత్తా చాటాడు.

2022 నుంచి సిరాజ్ 20 ODIలు ఆడాడు. అందులో అతను 18.73 సగటు, 4.43 ఎకానమీతో 38 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో ఈ కాలంలో ఏ బౌలర్ కూడా ఇన్ని వికెట్లు పడగొట్టలేదు.

సిరాజ్ పడగొట్టిన 38 వికెట్లలో 10 ఓవర్లలోపే 25 వికెట్లు పడగొట్టాడు. అంటే పవర్‌ప్లే ముగిసిపోకముందే బ్యాటర్లకు సిరాజ్ చుక్కలు చూపించాడన్నమాట.

2022 నుంచి ఇప్పటి వరకు పవర్‌ప్లేలో సిరాజ్ 25 వన్డే వికెట్లు పడగొట్టడం కూడా ఒక రికార్డుగా నిలిచింది. ICC ర్యాంకింగ్స్‌లో చేరిన టాప్ 10 ODI జట్లలోనూ ఈ ఫిగర్ అద్భుతంగా నిలిచింది.

సిరాజ్ 2019లో ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డేల్లో రెండోసారి తలపడనున్న తరుణంలో అందరి దృష్టి ఈ హైదరాబాదీ పేసర్‌పైనే ఉంటుంది. ఎందుకంటే 2019 నాటి సిరాజ్‌కి, నేటి సిరాజ్‌కి మధ్య చాలా తేడా ఉంది.




