- Telugu News Sports News Cricket news Ind vs aus wasim jaffer picks team india playing 11 for 1st odi against australia in mumbai
Ind vs Aus 1st ODI Playing XI: 4గురు దిగ్గజాలు లేకుండానే బరిలోకి.. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత ప్లేయింగ్ 11 ఇదే..
India vs Australia: నేటి (మార్చి 17) నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడు.
Updated on: Mar 17, 2023 | 7:13 AM

నేటి (మార్చి 17) నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడు.

శ్రేయాస్ అయ్యర్ కూడా గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. అయితే ఇక్కడ హిట్‌మ్యాన్, అయ్యర్‌ల స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ప్రశ్నగా మారింది.

ఈ ఆసక్తికర ప్రశ్నకు టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సమాధానమిచ్చాడు. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కుతుందని వసీం జాఫర్ పేర్కొన్నాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్‌కు బదులుగా జట్టులోకి పునరాగమనం చేసిన రవీంద్ర జడేజా జట్టులో కనిపించనున్నాడు. వసీం జాఫర్ ప్రకారం, టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ.

సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా.

రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్.

మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

హార్దిక్ పాండ్యా (కెప్టెన్-తొలి వన్డే) రోహిత్ శర్మ (మొదటి మ్యాచ్‌కు అందుబాటులో లేడు), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్. షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.




