Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఒక్క క్యాచ్ కోసం పరిగెత్తిన ముగ్గురు ఫీల్డర్స్.. చివర్లో ట్విస్ట్ మాములుగా లేదు.!

ఒక క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుందని మీరు వినే ఉంటారు. క్రికెట్‌లో ఇది సర్వసాధారణం. అప్పటిదాకా గెలవాల్సిన జట్టునైనా..

Watch Video: ఒక్క క్యాచ్ కోసం పరిగెత్తిన ముగ్గురు ఫీల్డర్స్.. చివర్లో ట్విస్ట్ మాములుగా లేదు.!
Catch
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 16, 2021 | 5:04 PM

ఒక క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుందని మీరు వినే ఉంటారు. క్రికెట్‌లో ఇది సర్వసాధారణం. అప్పటిదాకా గెలవాల్సిన జట్టునైనా.. ఓటమి అంచుల్లోకి వెళ్లిన జట్టును విజయతీరాలకు చేర్చాలన్న మ్యాచ్‌ను మలుపు తిప్పే ఒక క్యాచ్ చాలు. సరిగ్గా ఇలాంటి ఓ క్యాచ్‌ను పట్టేందుకు ముగ్గురు ఫీల్డర్స్ ప్రయత్నించారు. ఇక చివరికి ఏం జరిగిందన్నది సస్పెన్స్.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి..

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఇక మార్ష్ కప్ టోర్నీలో ఇటీవల దక్షిణ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా.. కెప్టెన్ ట్రావిస్ హెడ్ 230 పరుగుల భారీ ఇన్నింగ్స్ కారణంగా 48 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 391 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం రావడంతో.. క్వీన్స్‌ల్యాండ్‌కు డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 44 ఓవర్లలో 380 పరుగుల లక్ష్యాన్ని విధించారు. ఈ భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో ఆ జట్టు 40.3 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా సౌత్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.

1 క్యాచ్, 3 ఫీల్డర్లు, చివర్లో ట్విస్ట్..

ఈ మ్యాచ్‌లో క్వీన్స్‌ల్యాండ్ ఇన్నింగ్స్ 37వ ఓవర్ జరుగుతున్నప్పుడు.. ఆ జట్టు స్కోర్ 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు. అప్పుడు క్రీజులో ఉన్న బ్యాటర్ మైఖేల్ నాసర్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి గాల్లోకి లేచింది. ఇక దానిని అందుకునేందుకు ముగ్గురు ఫీల్డర్స్ బౌండరీ లైన్ వైపు పరిగెత్తారు. ఓ ఫీల్డర్ ఆ క్యాచ్‌ను అందుకున్నా.. అతడు అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. ఇక అతడి వెంట ఉన్న మరో ఇద్దరు ఫీల్డర్స్ కూడా బౌండరీ లైన్ ఇవతల బంతిని అందుకోలేకపోయారు. చివరికి వీరి ప్రయత్నాలన్నీ విఫలం కావడం.. అంపైర్ దాన్ని సిక్స్‌గా ఇవ్వడం జరిగింది.

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!