KKR vs DC Qualifier 2 Result: వాట్ ఏ మ్యాచ్.. చివరి ఓవర్లో ఫలితం.. 3 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరిన కోల్‌కతా.. ఢిల్లీకి మరో ‘సారీ’

IPL 2021 KKR vs DC Winner: ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 136 పరుగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించి, ఐపీఎల్ 2021లో ఫైనల్‌కు చేరుకుంది.

KKR vs DC Qualifier 2 Result: వాట్ ఏ మ్యాచ్.. చివరి ఓవర్లో ఫలితం.. 3 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరిన కోల్‌కతా.. ఢిల్లీకి మరో 'సారీ'
Kkr Vs Dc, Ipl 2021

DC vs KKR, IPL 2021: ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో కోల్‌కతా టీం అద్భుతం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 136 పరుగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించి, ఐపీఎల్ 2021లో ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌తో అక్టోబర్ 15 శుక్రవారం నాడు దుబాయ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం తలపడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఏదశలోనూ కోలుకోకుండా చేసింది. తక్కువ స్కోర్‌ను దాదాపు ఓపెనర్లే పూర్తి చేస్తారా అనేలా బ్యాటింగ్ చేసి విజయానికి 96 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. వెంకటేష్ అయ్యర్ కేవలం 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 55 పరుగులు చేశాడు. విజయానికి మరో 39 పరుగులు కావాల్సిన సమయంలో రబాడా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కానీ, అప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలోంచి మ్యాచ్ జారిపోయింది. అనంతరం శుభ్మన్ గిల్ (46 పరుగులు, 46 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) రాణించడంతో కోల్‌కతా విజయం చాలా తేలికగా మారింది. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ ఔటయ్యాడు. అయితే వీరిద్దరు ఔటయ్యాక పరిస్థితి మొత్తం మారిపోయింది. చివరి బంతి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించేందుకు రెడీ అయింది. వరుసగా వికెట్లు తీస్తూ విజయానికి చాలా చేరువయ్యారు. కానీ, త్రిపాఠి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో మరో బంతి మిగిలుండగానే సిక్స్ కొట్టి కోల్‌కతా విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మధ్యలో నితీష్ రానా 13 పరుగులు చేసి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత దినేష్ కార్తిక్ 0, మోర్గాన్ 0, షకిబుల్ హసన్ 0, సునీల్ నరైన్ 0 పరుగులకు పెవిలియన్ చేరారు. ఢిల్లీ బౌలర్లలో రబాడా, నార్త్ట్, అశ్విన్ తలో 2 వికెట్లు, అవేష్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ టీం టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 135 పరగులు చేసింది. దీంతో కోల్‌కతా టీం ముందు 136 పరుగుల స్కోర్‌ను ఉంచింది. అయితే ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లు ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి ఢిల్లీని చాలా తక్కువ పరుగులకు కట్టడి చేశారు. పృథ్వీ షా(18) పరుగులతో మంచి ఊపులో ఉన్నప్పుడు చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ వరుసగా వికెట్లు కోల్పోతూ, పరుగులు సాధించడంలో వెనుకపడ్డారు. ధావన్ (36) ఒక్కడే అత్యధిక పరుగులు చేసిన వాడిగా నిలిచాడు. స్టోయినిస్ 18, రిషబ్ పంత్ 6, హెట్ మెయిర్ 17 తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. శ్రేయాస్ అయ్యర్ 24, అక్షర్ పటేల్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, శివం మావి, ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు.

రెండు జట్ల మధ్య గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ టీం 3-2తో ఆధిక్యం సంపాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 29 సార్లు ఐపీఎల్‌లో తలపడతాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 15 మ్యాచ్‌లు గెలిచింది. 13 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

ప్లేయింగ్ ఎలెవన్ :
ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషబ్ పంత్ (కీపర్/కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, షిమ్రాన్ హెట్‌మెయర్, టామ్ కుర్రాన్/మార్కస్ స్టోయినిస్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే

కోల్‌కతా నైట్ రైడర్స్: శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

Also Read: Goutham Gambir: ‘ఏబీ డివిలియర్స్‌ను ఆర్సీబీ తిరిగి తీసుకోకపోవచ్చు.. మాక్సీని తిసుకుంటారా’..

DC vs KKR, IPL 2021: తడబడిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్స్.. కోల్‌కతా టార్గెట్ 136..!

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu