Goutham Gambir: ‘ఏబీ డివిలియర్స్‌ను ఆర్సీబీ తిరిగి తీసుకోకపోవచ్చు.. మాక్సీని తిసుకుంటారా’..
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు మెగా వేలం జరగనుంది. అయితే ఏ జట్టు ఎవరిని తిరిగి జట్టులోకి తీసుకుంటారని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ముంబై ఏ ఆటగాళ్లను తీసుకుంటుందనే దానిపి వీరేందర్ సెహ్వాగ్ కొందరి పేర్లు చెప్పారు.
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు మెగా వేలం జరగనుంది. అయితే ఏ జట్టు ఎవరిని తిరిగి జట్టులోకి తీసుకుంటారని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ముంబై ఏ ఆటగాళ్లను తీసుకుంటుందనే దానిపి వీరేందర్ సెహ్వాగ్ కొందరి పేర్లు చెప్పారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. తాజాగా గౌతమ్ గంభీర్ కూడా ఆర్సీబీ జట్టు ఎవరిని తిరిగి తీసుకుంటుంది అనే దానిపై స్పందించారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని జట్టులో కొనసాగించాలని భావిస్తే.. ఏబీ డివిలియర్స్‌ని రిటైన్ చేసుకోకపోవచ్చని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు (513) చేసిన మ్యక్సీకి ఆ జట్టులో మంచి భవిష్యత్తు ఉందని, 37 ఏళ్ల డివిలియర్స్‌కు ఛాన్స్ లేదని చెప్పారు. ఆర్‌సీబీ మ్యాక్స్‌వెల్‌తోపాటు విరాట్ కోహ్లి, యుజువేంద్ర చాహల్‌ని రిటైన్ చేసుకోవాలనుకుంటున్నట్లు గౌతీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 2011లో ఆర్‌సీబీ జట్టులో చేరాడు.ఇప్పటివరకు 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ.. 5162 పరుగులు సాధించాడు. అయితే వచ్చే సీజన్ నుంచి రెండు కొత్త ఫ్రాంచైజీలు రానున్నాయి. రెండు కొత్త IPL జట్ల కొనుగోలు కోసం బీసీసీఐ ఇప్పటికే టెండర్స్ ఆహ్వానించింది. రెండు కొత్త జట్ల ఎంపిక కోసం గౌహతి, రాంచీ, కటక్ (ఆల్ ఈస్ట్), అహ్మదాబాద్ (పశ్చిమ), లక్నో (సెంట్రల్ జోన్), ధర్మశాల (నార్త్) ఆరు నగరాలను బోర్డు పరిశీలిస్తోంది.