IND vs PAK: దాయాదుల మధ్య పోరుకు సమయం దగ్గరపడుతోంది.. పాక్‌ను టీజ్ చేస్తూ చేసిన మౌకా మౌకా యాడ్‌ను చూశారా?
T20 World Cup 2021: క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ సమయం దగ్గరపడుతోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియా, పాకిస్థాన్‌లు...
T20 World Cup 2021: క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ సమయం దగ్గరపడుతోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియా, పాకిస్థాన్‌లు అక్టోబర్ 24న తలపడనున్నాయి. చాలా రోజుల తర్వాత దాయాదుల మధ్య జరుగుతోన్న పోరుపై అందరి దృష్టి పడింది. సహజంగానే ఈ రెండు జట్ల మధ్య పోరు అంటే ఆసక్తి ఉంటుంది. అందులోనూ ప్రపంచకప్ కావడంతో ఎక్కడలేని అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరిగే సమయంలో వచ్చే ‘మౌకా మౌకా’ అనే యాడ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2015 వరల్డ్ కప్ సమయంలో మొదలైన ఈ యాడ్ ప్రతీ ఏటా టోర్నీలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు ప్లే చేయడం ఆనవాయితీగా వస్తోంది.
దీంతో ఈసారి కూడా వీక్షకులను ఆకట్టుకోవడానికి ఈ యాడ్ సరికొత్తగా వచ్చేసింది. ఈ సారి ప్రపంచకప్ దుబాయ్ వేదికగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ పాకిస్థాన్ ఫ్యాన్ టపాసులతో ఓ టీవీ షోరూమ్‌లోకి వెళుతాడు. అక్కడ ఉన్న తన ఇండియన్ ఫ్రెండ్‌కు టపాసులను చూపిస్తూ.. ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ జరుగుతుంది. ఇందులో పాకిస్థాన్ గెలుస్తుందని చెబుతాడు. దీనికి స్పందించిన ఆ టీవీ ఓనర్.. తమ షాపులో ఓ ఆఫర్ ఉందని చూపిస్తూ.. ‘బై వన్ బ్రేక్ వన్’ ఆఫర్ ఉందంటూ ఫన్నీగా టీజ్ చేస్తాడు. ప్రస్తుతం ఈ యాడ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రమోట్ చేయడానికి స్టార్ స్పోర్ట్స్ ఇలా వినూత్నంగా ప్రయత్నించిందన్నమాట. మరి ఈ కొత్త యాడ్‌ను మీరూ ఓసారి చూసేయండి..
Naya #MaukaMauka, naya offer – #Buy1Break1Free! ?
Are you ready to #LiveTheGame in #INDvPAK?
ICC Men’s #T20WorldCup 2021 | Oct 24 | Broadcast starts: 7 PM, Match starts: 7:30 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/MNsOql9cjO
— Star Sports (@StarSportsIndia) October 13, 2021
Also Read: Rakul Preet Singh Marriage: బాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకుతో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. వీడియో
పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లిన మహిళ.. ఆ రోజుతో ఆమె సుడి తిరిగిపోయింది.. వీడియో