ICC World Cup: వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు ఇవే.. టాప్ 10 లిస్టులో ముగ్గురు మనోళ్లే..
Quinton de Kock: ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌కు 23వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 383 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగులు చేసింది. కాగా, 2007 ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ చేసిన 149 పరుగులను అధిగమించిన డి కాక్.. ఒక ODI ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ కం బ్యాటర్ నమోదు చేసిన అత్యధిక స్కోరును లిఖించాడు.

ICC ODI World Cup 2023, South Africa vs Bangladesh: మంగళవారం వాంఖడే స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డి కాక్ వన్డే ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో అత్యధిక స్కోరును నమోదు చేశాడు. ఈ ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 174 పరుగులు చేశాడు.
2007 ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ చేసిన 149 పరుగులను అధిగమించిన డి కాక్.. ఒక ODI ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ కం బ్యాటర్ నమోదు చేసిన అత్యధిక స్కోరును తన ఖాతాలో లిఖించుకున్నాడు.
ఈ దక్షిణాఫ్రికా లెఫ్ట్ హ్యాండర్ చేసిన174 పరుగులే వాంఖడేలో ఒక ఇన్నింగ్స్‌లో ఒక బ్యాటింగ్‌లో అత్యధిక ODI స్కోరుగా నిలిచింది.




టాప్ 10 ODI ప్రపంచ కప్ స్కోర్లు ఎవరి పేరిట నమోదయ్యాయో ఇప్పుడు చూద్దాం..
1. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) – 162 బంతుల్లో 237* vs వెస్టిండీస్ (2015)
2. క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 147 బంతుల్లో 215 vs జింబాబ్వే (2015)
3. గ్యారీ కిర్‌స్టన్ (సౌతాఫ్రికా) – 159 బంతుల్లో 188* vs యూఏఈ (1996)
4. సౌరవ్ గంగూలీ (భారత్) – 158 బంతుల్లో 183 vs శ్రీలంక (1999)
5. వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్) – 125 బంతుల్లో 181 vs శ్రీలంక (1987)
6. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 133 బంతుల్లో 178 vs ఆఫ్ఘానిస్తాన్ (2015)
7. కపిల్ దేవ్ (భారత్) – 138 బంతుల్లో 175* vs జింబాబ్వే (1983)
8. వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) – 140 బంతుల్లో 175 vs బంగ్లాదేశ్ (2011)
9. క్వింటన్ డి కాక్ (సౌతాఫ్రికా) – 140 బంతుల్లో 174 vs బంగ్లాదేశ్ (2023)
10. క్రెయిగ్ విషార్ట్ (జింబాబ్వే) – 151 బంతుల్లో 172* vs నమీబియా (2003)
ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌కు 23వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 383 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగులు చేసింది. మంగళవారం ముంబైలోని వాంఖడే మైదానంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ 174 పరుగులు, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 60 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 90 పరుగులు చేశారు.
హసన్ మహమూద్ రెండు వికెట్లు తీయగా, మెహదీ హసన్ మిరాజ్, షోరిఫుల్ ఇస్లాం, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ తీశారు.
రెండు జట్ల ప్లేయింగ్ 11..
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబాడమ్స్.
బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా రియాద్, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




