AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: శిఖర్ ధావన్ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడా.. అసలెవరీ మిస్టరీ గర్ల్? వైరల్ వీడియో

Shikhar Dhawan Video: గతేడాది అక్టోబర్‌లో శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఓ కొత్త అమ్మాయితో ధావన్ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ధావన్‌తో గల సంబంధం ఏంటో తెలుసుకుందాం.

Video: శిఖర్ ధావన్ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడా.. అసలెవరీ మిస్టరీ గర్ల్? వైరల్ వీడియో
Shikhar Dhawan Spotted With New Girl
Venkata Chari
|

Updated on: Nov 04, 2024 | 5:40 PM

Share

Shikhar Dhawan Video: శిఖర్ ధావన్ మళ్లీ ఎవరితోనైనా ప్రేమలో పడ్డాడా? ధావన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా? తెరపైకి వచ్చిన ఫొటోలతో సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇందుకు కారణం కూడా ఉందండోయ్.. శిఖర్ ధావన్ కొత్త అమ్మాయితో కెమెరాకు చిక్కాడు. ఓ మిస్టరీ అమ్మాయితో విమానాశ్రయంలో కనిపించాడు. అయితే, ఆ అమ్మాయి ఎవరు, ధావన్‌తో ఆమెకు ఉన్న అనుబంధం గురించి ఇంకా అధికారికంగా ఏమీ తెలియదు. అయితే, టీమిండియా మాజీ ఓపెనర్ జీవితంలో కొత్తదనం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

గబ్బర్ మళ్లీ ప్రేమలో పడ్డాడా?

కొత్త అమ్మాయితో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ధావన్ బ్లూ టీ-షర్టు, నలుపు కార్గో ధరించి కనిపించాడు. ఈ వీడియోలో, ధావన్‌తో ఆ అమ్మాయి కూడా కనిపిస్తుంది. అమ్మాయి కెమెరా నుంచి తనను తాను రక్షించుకోవడం, సిగ్గుపడటం కనిపిస్తుంది. ధావన్‌తో తన ఫొటోను ఎవరూ ఒకే ఫ్రేమ్‌లో తీయకూడదని ఆమె తన వంతు ప్రయత్నం చేసింది.

కొత్త అమ్మాయితో ధావన్ ఫొటో..

గతేడాది అక్టోబర్‌లో శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత ధావన్ కొత్త అమ్మాయితో కనిపించడం చాలా విషయాలు చెబుతుంది. రాబోయే రోజుల్లో శిఖర్ ధావన్‌తో ఈ కొత్త సంబంధం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ ఏడాది క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్..

ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడితే, అతను ఈ ఏడాది ఆగస్టులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ధావన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 269 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 10867 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 24 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధావన్ నిలిచాడు. అతను 8 మ్యాచ్‌ల్లో 51.50 సగటుతో 412 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..