AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మిచెల్ స్టార్క్ బౌలింగ్ ని చీల్చి చెండాడిన ఫిల్ సాల్ట్! IPL 2025 లో RCB నయా రికార్డ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించగా, మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్లో సాల్ట్ మూడు బౌండరీలు, రెండు సిక్సర్లు బాది 30 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్లో కోహ్లీ కూడా బౌండరీ కొట్టి RCB కేవలం 3 ఓవర్లలో 53 పరుగులు చేసిన ఘనత సాధించింది. అక్షర్ పటేల్ వేసిన ఓవర్లోనూ సాల్ట్, కోహ్లీ మంచి స్టార్ట్ ఇచ్చారు. ఈ విజృంభణతో RCB కేవలం 3 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ను దాటేసింది. ఈ సీజన్‌లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా RCB రికార్డు నెలకొల్పింది

Video: మిచెల్ స్టార్క్ బౌలింగ్ ని చీల్చి చెండాడిన ఫిల్ సాల్ట్! IPL 2025 లో RCB నయా రికార్డ్
Virat Kohli Phil Salt
Narsimha
|

Updated on: Apr 10, 2025 | 8:28 PM

Share

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యా ఆర్సీబీ ఓపెనర్ల విల్ సాల్ట్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన టీ20 కెరీర్‌లో 100 అర్ధశతకాలు కొట్టిన మొదటి భారత బ్యాటర్ కావాలనే లక్ష్యంతో బరిలోకి దిగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.

మిచెల్ స్టార్క్‌పై విరుచుకుపడ్డ ఫిల్ సాల్ట్

ఫిల్ సాల్ట్ మిచెల్ స్టార్క్ వేసిన ఓవర్లో మూడు బౌండరీలు, రెండు సిక్సర్లు బాది అతడిపై మొత్తం 30 పరుగులు రాబట్టాడు. అదే ఓవర్‌లో విరాట్ కోహ్లీ కూడా ఒక బౌండరీ బాది అద్భుతంగా ఆడాడు. ఈ విజృంభణతో RCB కేవలం 3 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ను దాటేసింది. ఈ సీజన్‌లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా RCB రికార్డు నెలకొల్పింది.

RCB 3 ఓవర్లలో 53/0.. అద్భుత ఆరంభం!

మూడో ఓవర్‌ను మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేయంగా  మొదటి బంతిని మధ్య, లెగ్ స్టంప్ వైపు వేసాడు.. ఫిల్ సాల్ట్ ఆ బంతిని బౌలర్ తలపైనే బాదుతూ భారీ సిక్స్ కొట్టాడు. రెండో బంతిని పాయింట్ మీదుగా బౌండరీగా, మూడో బంతిని మిడ్-ఆన్ దాటి బౌండరీగా మారుస్తూ తన ఆటను కొనసాగించాడు.

నాల్గో బంతికి సరైన కనెక్షన్ రాకపోయినా, మిడ్-ఆన్ ఫీల్డర్‌ను తప్పించి బంతి బౌండరీ దాటి వెళ్లింది. అంతేకాదు, అది నో బాల్ కూడా! తర్వాతి బంతిని స్టార్క్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్‌గా వేయగా, సాల్ట్ పుల్ చేయగా టాప్ ఎడ్జ్ లభించి వికెట్‌కీపర్ తల మీదుగా వెళ్లి మరో సిక్స్ గా మలిచాడు. ఐదో బంతికి లెగ్ బైతో రన్ తీసుకున్నాడు. ఆఖరి బంతి విరాట్ కోహ్లీ హిప్స్‌కు తాకి బౌండరీ వెళ్లింది. దీంతో ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 36 పరుగులు చేసి అదరగొట్టాడు.

ఇక అంతకముందు అక్షర్ పటేల్ రెండో ఓవర్ వేయగా, విరాట్ కోహ్లీ మొదటి బంతిని షార్ట్ తర్డ్ మాన్ మీదుగా బాదడంతో బౌండరీగా వచ్చింది. మూడో బంతికి సింగిల్ తీసి సాల్ట్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. సాల్ట్ నాలుగో బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. ఐదో బంతిని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా పవర్‌గా బాదడంతో మరో బౌండరీ వచ్చింది.

కాగా RCB తమ గత మ్యాచ్‌లో ఆడిన అదే ప్లేయింగ్ XIతో బరిలోకి దిగింది. DC తరఫున ఫాఫ్ డుప్లెసిస్ తిరిగి జట్టులోకి వచ్చాడు, కానీ సమీర్ రిజ్వీ బెంచ్‌పై ఉన్నాడు. KL రాహుల్ మధ్య ఓర్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.

RCB ప్లేయింగ్ XI:

ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ Impact Subs: సుయాష్ శర్మ, రషిక్ సలాం, మనోజ్ భండాగే, జేకబ్ బెత్‌హెల్, స్వప్నిల్ సింగ్

DC ప్లేయింగ్ XI:

ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, KL రాహుల్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్ Impact Subs: అభిషేక్ పోరెల్, దర్శన్ నల్కండే, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, డొనోవన్

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..