Video: బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. గాల్లోకి ఎగిరి, ఒంటిచేత్తే క్యాచ్.. వీడియో చూస్తే, స్టన్ అవ్వాల్సిందే..
Sean Abbott Catch: ఫ్యాన్‌కోడ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి సీన్ అబాట్ క్యాచ్ వీడియోను షేర్ చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో అబాట్ ఈ క్యాచ్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున నాథన్ ఎల్లిస్ ఈ ఓవర్‌ను బౌలింగ్ చేశాడు. దక్షిణాఫ్రికా తరపున మార్కో జెన్సన్ క్రీజులో ఉన్నాడు. ఎల్లిస్ నాల్గవ బంతిని ఆఫ్ స్టంప్ వెలుపల బ్యాట్స్‌మన్‌కి దగ్గరగా వేశాడు. దానిపై జాన్సెన్ అద్భుతమైన షాట్ ఆడాడు. ఆ షాట్ చూసి ఈ బాల్ ఫోర్ లేదా సిక్సర్ బాదాడని అందరూ అనుకున్నారు. అయితే, సీన్‌లోకి ఎంటరైన ఆస్ట్రేలియా ఫీల్డర్ సీన్ అబాట్..
South Africa vs Australia: ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా అద్భుత విజయంతో తిరిగొచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ప్రతిస్పందనగా, మొత్తం ఆస్ట్రేలియా జట్టు కేవలం 227 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా తరపున ఐడెన్ మార్క్రామ్ 102 పరుగులతో అజేయ సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు సీన్ అబాట్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ లైన్‌పై కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. బ్యాట్స్‌మన్ కూడా ఈ క్యాచ్‌ను చూసి ఆశ్చర్యపోయాడు.
ఫ్యాన్‌కోడ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి సీన్ అబాట్ క్యాచ్ వీడియోను షేర్ చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో అబాట్ ఈ క్యాచ్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున నాథన్ ఎల్లిస్ ఈ ఓవర్‌ను బౌలింగ్ చేశాడు. దక్షిణాఫ్రికా తరపున మార్కో జెన్సన్ క్రీజులో ఉన్నాడు. ఎల్లిస్ నాల్గవ బంతిని ఆఫ్ స్టంప్ వెలుపల బ్యాట్స్‌మన్‌కి దగ్గరగా వేశాడు. దానిపై జాన్సెన్ అద్భుతమైన షాట్ ఆడాడు. ఆ షాట్ చూసి ఈ బాల్ ఫోర్ లేదా సిక్సర్ బాదాడని అందరూ అనుకున్నారు. అయితే, సీన్‌లోకి ఎంటరైన ఆస్ట్రేలియా ఫీల్డర్ సీన్ అబాట్.. తన ఎడమవైపు అద్భుతంగా డైవ్ చేసి ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. అబాట్ అందుకున్న ఈ క్యాచ్ చూసి మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీన్ అబాట్ అద్భుతమైన క్యాచ్ వీడియో..
No wonder Kangaroos are found only in Australia 😏 What a leap! #SAvAUS pic.twitter.com/9dbJ0SlJ9B
— FanCode (@FanCode) September 12, 2023
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు టాప్ ఆర్డర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. తొలుత జట్టు కెప్టెన్ టెంబా బావుమా (57), క్వింటన్ డి కాక్ (82) తొలి వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మార్క్రామ్ 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 102 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడారు. మార్క్రామ్ అద్భుత బ్యాటింగ్‌తోపాటు డేంజరస్ బౌలింగ్ ఆధారంగా దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది.
ఇరుజట్లు:
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, సిసంద మగల, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మార్నస్ లాబుస్‌చాగ్నే, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, జోష్ హాజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..