చివరి బంతికి సిక్స్ కొట్టాడు.. అవార్డులను కొల్లగొట్టాడు.. ఈ ఆర్‌సీబీ ప్లేయర్ లాస్ట్ మ్యాచ్ సంపాదన ఎంతో తెలుసా?

శ్రీకర్ భరత్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ఈ ఐపీఎల్ డ్రీమ్ సీజన్ అని చెప్పొచ్చు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో..

చివరి బంతికి సిక్స్ కొట్టాడు.. అవార్డులను కొల్లగొట్టాడు.. ఈ ఆర్‌సీబీ ప్లేయర్ లాస్ట్ మ్యాచ్ సంపాదన ఎంతో తెలుసా?
Srikar Bharat
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 09, 2021 | 3:03 PM

శ్రీకర్ భరత్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ఈ ఐపీఎల్ డ్రీమ్ సీజన్ అని చెప్పొచ్చు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకర్ భరత్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అతడు 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ముఖ్యంగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భరత్ చివరి బంతికి సిక్స్ కొట్టి బెంగళూరు జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఐపీఎల్ 2021 ముందు ఆర్సీబీ అత్యుత్తమ కొనుగోళ్లలో భరత్ ఒకరని అభిమానులు పేర్కొంటున్నారు. అటు విరాట్ కోహ్లీ కూడా భరత్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.

రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తూ ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్న భరత్‌కు ఈ సీజన్ కలిసొచ్చిందని చెప్పాలి. ఎంతోమంది ప్లేయర్స్ ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా నేషనల్ జట్టుకు ఎంపికయ్యారు. ఇప్పుడు అదే కోవలో శ్రీకర్ భరత్ కూడా పయనిస్తున్నాడు. చివరి మ్యాచ్‌లో శ్రీకర్ భరత్ పలు అవార్డులను కొల్లగొట్టాడు.

డ్రీమ్ 11 గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్, అన్ అకాడమీ క్రాకింగ్ సిక్స్‌, మోస్ట్ వాల్యూబుల్ అసెట్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు శ్రీకర్ భరత్‌కు వరించాయి. దీనితో మొత్తంగా రూ. 3 లక్షలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఆర్సీబీ ఫ్రాంఛైజీ అతడిని వేలంలో రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. కోహ్లీసేన అక్టోబర్ 11న ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది. ఒకవేళ ఓడితే టోర్నీ నుంచి వెళ్లిపోతుంది. ఒకవేళ గెలిస్తే మొదటి క్వాలిఫయర్‌లో ఓడిపోయిన జట్టుతో ఫైనల్ కోసం తలబడుతుంది.

Read Also: ఇంటి దారి పట్టిన డిఫెండింగ్ ఛాంపియన్స్.. ప్లేఆఫ్స్‌కి అంతా సిద్దం..

మానిటర్ బల్లిపై చిరుత మెరుపు దాడి.. ఎటాక్‌ మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు.!

13 బంతుల్లో పెను విధ్వంసం.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు..

సమంత పిల్లల్ని కనాలనుకుంది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో