Shikha Pandey: వావ్ వాటే బౌలింగ్.. బంతి అలా ఎలా స్వింగ్ అయ్యిందబ్బా.? ఉమెన్ క్రికెట్‌లో అద్భుతం.
shikha pandey: క్రికెట్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేనిది. అందుకే కోట్లాది మంది అభిమానులు క్రికెట్‌ను అంతలా ఇష్టంతో వీక్షిస్తుంటారు. మెరుపు షాట్‌లు, అద్భుతమైన ఫీల్డింగ్, బుల్లెట్లా దూసుకొచ్చే..
shikha pandey: క్రికెట్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేనిది. అందుకే కోట్లాది మంది అభిమానులు క్రికెట్‌ను అంతలా ఇష్టంతో వీక్షిస్తుంటారు. మెరుపు షాట్‌లు, అద్భుతమైన ఫీల్డింగ్, బుల్లెట్లా దూసుకొచ్చే బంతులు ఇలా ఆట ముగింపు వరకు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. క్షణం క్షణంకు మ్యాచ్ తీరు మారిపోతుంది. అయితే ఇలాంటివి ఎక్కువగా పురుషుల క్రికెట్‌లోనే జరుగుతాయని మనలో చాలా మంది భావిస్తుంటారు. మహిళల క్రికెట్ మ్యాచ్‌లతో పోలిస్తే మెన్ క్రికెట్‌కు ఎక్కువగా వ్యూయర్ షిప్ ఉండడమే దీనికి సాక్ష్యంగా చెప్పవచ్చు. అయితే మహిళలు కూడా పురుషులకు ఏమాత్రం తీసిపోరని చాటి చెప్పింది. ఉమెన్ క్రికెటర్ శిఖా పాండే.
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో శిఖా పాండే వేసిన బంతి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకుంది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ శిఖా పాండే వేసిన బంతి అనూహ్యంగా స్వింగ్ అయ్యి వికెట్ల మీదికి దూసుకొచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బ్యాటింగ్‌లో ఉన్న హేలీ ఒక్కసారి బంతి అలా స్వింగ్ అవ్వగానే గందరగోళానికి గురైంది. ఇక శిఖా పాండే విసిరిన బంతిపై ప్రముఖ క్రికెటర్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ విషయమై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ మహిళా క్రికెట్‌లో ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శిఖా పాండే వేసిన అద్భుత బంతిని మీరు కూడా చూసేయండి మరి. అయితే ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
Ball of the century, women’s cricket edition! Take a bow Shikha Pandey?? #AUSvIND pic.twitter.com/WjaixlkjIp
— Wasim Jaffer (@WasimJaffer14) October 9, 2021