AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత పిల్లల్ని కనాలనుకుంది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ..

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించిన అనంతరం సమంతపై..

Samantha: సమంత పిల్లల్ని కనాలనుకుంది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ..
Samantha
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 09, 2021 | 3:02 PM

Share

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించిన అనంతరం సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు విడాకుల విషయంలో సామ్‌దే తప్పు అని దెప్పి పొడుస్తున్నారు. సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని.. అబార్షన్ చేయించుకుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. ఇక తాజాగా వీటిపై సమంత స్పందించింది. వాటిని తీవ్రంగా ఖండిస్తూ భావోద్వేగ ట్వీట్ ఒకటి పోస్ట్ చేసింది.

”నాకు అఫైర్స్ ఉన్నాయని.. పిల్లలు వద్దనుకున్నానని, అవకాశవాదినని.. అబార్షన్లు చేయించుకున్నానని” తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సమంత మండిపడింది. ఇలా తనపై పర్సనల్‌గా ఎటాక్ చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. విడాకులు తీసుకోవడం ఎంతో బాధతో కూడుకున్నదని.. ఈ కఠిన సమయంలో తనకు అండగా నిలిచినవారికి ధన్యవాదాలు” అంటూ సమంత ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా చై-సామ్ విడాకులపై నిర్మాత నీలిమ గుణ షాకింగ్ కామెంట్స్ చేసింది. సామ్ తల్లి కావాలనుకుందని.. కానీ ఇంతలోనే ఏదో జరిగిందని ఆమె వెల్లడించింది.

”శాకుంతలం సినిమా కోసం సమంతను సంప్రదించినప్పుడు.. ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయింది. ఫ్యామిలీని ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పట్లో సినిమా చేయనని వివరించింది. కానీ మా సినిమా కథ నచ్చడంతో కొన్ని కండీషన్స్ పెట్టింది. తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని కోరింది. ఈ మూవీ అనంతరం సమంత సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవాలని.. తల్లి కావాలని అనుకుంది. సామ్ చెప్పిన ప్రకారం మేము షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. సినిమాల నుంచి ఎక్కువ కాలం విరామం తీసుకుని.. పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసుకుంది. అదే ఆమె ప్రాధాన్యతగా చెప్పుకొచ్చిందని” నీలిమ స్పష్టం చేసింది.

Samantha

Read Also: ఇంటి దారి పట్టిన డిఫెండింగ్ ఛాంపియన్స్.. ప్లేఆఫ్స్‌కి అంతా సిద్దం..

చివరి బంతికి సిక్స్ కొట్టాడు.. అవార్డులను కొల్లగొట్టాడు.. ఈ ఆర్‌సీబీ ప్లేయర్ లాస్ట్ మ్యాచ్ సంపాదన ఎంతో తెలుసా?

మానిటర్ బల్లిపై చిరుత మెరుపు దాడి.. ఎటాక్‌ మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు.!

13 బంతుల్లో పెను విధ్వంసం.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు..