Prime Minister’s XI vs India: శుభ్‌మాన్ గిల్ ను అక్కడ కొట్టిన రోహిత్! తరువాత ఏం జరిగిందంటే.!
కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరిగిన వార్మప్ గేమ్‌లో, రోహిత్ శర్మ శుభ్‌మాన్ గిల్‌ను సరదాగా కొట్టడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. హర్షిత్ రాణా, శుభ్‌మాన్ గిల్ అద్భుత ప్రదర్శనతో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ ప్రతిభపై చెతేశ్వర్ పుజారా ప్రశంసలు కురిపిస్తూ, భవిష్యత్ కెప్టెన్‌గా బుమ్రానే సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డాడు.
కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో జరిగిన వార్మప్ గేమ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌ను సరదాగా కొట్టడం కెమెరాల్లో కనిపించింది. ప్రైమ్‌మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హర్షిత్ రాణా, శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ సందర్భంగా, రోహిత్ డగౌట్‌లో శుభ్‌మాన్ గిల్, హర్షిత్ రాణా, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌లతో జోకులాడుతూ సరదా మూడ్‌లో ఉన్నాడు. ఆ సమయంలో గిల్, నాయర్‌తో సరదాగా నవ్వుకుంటున్నప్పుడు, రోహిత్ సరదాగా గిల్ ఛాతీపై మోచేతితో కొట్టాడు. దీనికి గిల్ పగలబడి నవ్వుతూ స్పందించాడు, ఆ దృశ్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఇక, రోహిత్ శర్మ తర్వాత భారత జట్టుకు దీర్ఘకాల కెప్టెన్‌గా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అనువైన వ్యక్తి అని టెస్ట్ స్పెషలిస్ట్ చెతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన సమయంలో బుమ్రా చూపిన ఆదర్శవంతమైన నాయకత్వం, అతని కెప్టెన్సీ సామర్థ్యానికి చక్కని నిదర్శనం. పుజారా మాట్లాడుతూ, “బుమ్రా జట్టును నడిపించగల వ్యక్తి. అతను ఎప్పుడూ వ్యక్తిగతంగా మాట్లాడడు, జట్టుని, ఇతర ఆటగాళ్లను ప్రోత్సహిస్తాడు. అతని వైఖరీ టీమ్ ని గెలిపించడమే అని వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్‌లో, రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ లేకపోయినప్పటికీ, బుమ్రా తన సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అతని నాయకత్వం, మైదానంలో చూపిన నైపుణ్యం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇది భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో సిరీస్ కోల్పోయిన భారత్, ఆ ఆత్మవిశ్వాస లోటుతో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ప్రారంభించింది. అయితే, బుమ్రా తన అద్భుతమైన ఓపెనింగ్ స్పెల్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. అతని బౌలింగ్ నైపుణ్యం మాత్రమే కాకుండా, జట్టును నడిపించే అతని నాయకత్వ గుణం కూడా భారత విజయంలో కీలకమైన పాత్ర పోషించింది.
భారత జట్టు ఇంత ఘనంగా విజయాన్ని అందుకున్న సందర్భంలో, రోహిత్ బుమ్రాలు చూపిన చొరవ జట్టుకు మరింత బలాన్నిచ్చింది. ఈ విధంగా, వార్మప్ గేమ్ సరదాగా సాగింది.