ఐపీఎల్ వద్దంది.. పనికిరాడని పక్కనబెట్టింది.. కట్ చేస్తే.. 21 బంతుల్లో ఊహకందని ఊచకోత
ఐపీఎల్ మెగా వేలంలో ఈ ఆటగాడిని ఎవరూ దక్కించుకోలేదు. వేలంలో పేరు కూడా రాలేదు. అయితేనేం.. రెండు వారాల అనంతరం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సునామీ సృష్టించాడు. ఇంతకీ అతడెవరో తెల్సా..
ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది క్రికెటర్లు ఆశగా ఎదురు చూస్తారు. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలం పూర్తయి ఒక వారం కంటే ఎక్కువ సమయం గడిచింది. కానీ ఇంకా దాని గురించి ఎక్కడొక చోట చర్చ జరుగుతూనే ఉంది. ఈ పేలుడు బ్యాటర్ ఐపీఎల్‌లో ఆడింది కేవలం 3 మ్యాచ్‌లే.. కట్ చేస్తే.. పనికిరాడని ఫ్రాంచైజీ పక్కనబెట్టింది. తీరా ఇప్పుడు విధ్వంసం సృష్టించాడు. అతడు మరెవరో కాదు.. ఇంగ్లాండ్ పేలుడు బ్యాట్స్‌మెన్ టామ్ కోహ్లర్ కాడ్మోర్. ఈసారి అతడ్ని ఐపీఎల్ మెగా వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితేనేం అబుదాబి T10 లీగ్ ఫైనల్‌లో తుఫాను ఇన్నింగ్స్ ఆడి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.
కాడ్మోర్ ముందు లక్ష్యం..
గత కొన్ని రోజులుగా అబుదాబిలో జరుగుతున్న T10 లీగ్.. ఫైనల్‌కి చేరింది. ఆ ఫైనల్ డిసెంబర్ 2 సోమవారం జరిగింది. టైటిల్ కోసం డెక్కన్ గ్లాడియేటర్స్, మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సంప్ ఆర్మీ 10 ఓవర్లలో 104 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ కేవలం 23 బంతుల్లో 34 పరుగులతో అత్యధిక స్కోరును సాధించాడు. అయితే ఈ టీ10 లీగ్‌లో 104 పరుగులు కూడా చిన్న స్కోర్‌గానే తేలిపోయింది. ఈ లక్ష్యాన్ని కేవలం 7 ఓవర్లలోనే డెక్కన్ గ్లాడియేటర్స్ 2 వికెట్లు కోల్పోయి చేధించింది.
డెక్కన్ జట్టు ఓపెనర్లు ఒంటిచేత్తో మ్యాచ్‌ను ముగించారని చెప్పొచ్చు. ఇంగ్లాండ్‌కు చెందిన కోహ్లర్ కాడ్మోర్, వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్ ఈ జట్టు ఓపెనర్లు. పురన్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. పురన్ కేవలం 10 బంతుల్లో 28 పరుగులు చేసి నాలుగో ఓవర్‌లోనే జట్టును 50 పరుగులు దాటించాడు. ఆ తర్వాత , కాడ్మోర్ మిగిలిన పనిని పూర్తి చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కేవలం 21 బంతుల్లో 56 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కాడ్మోర్ తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. దీంతో డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టు అబుదాబి టీ10 టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఐపీఎల్ మెగా వేలంలో..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈసారి ఐపీఎల్ వేలంలో క్యాడ్‌మోర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈ స్పెషలిస్ట్ T20 బ్యాట్స్‌మెన్ 577 మంది ఆటగాళ్ల షార్ట్ లిస్ట్‌లో చోటు సంపాదించాడు కానీ అతని పేరు బిడ్డింగ్‌కు రాలేదు. కాడ్మోర్ గత సీజన్‌లో సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. అతడు కేవలం 3 మ్యాచ్‌ల్లో 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..