KKR: 11 బంతుల్లో పెను తుఫాన్.. 354 స్ట్రైక్‌రేట్‌తో గంభీర్ శిష్యుడి తోపు బ్యాటింగ్.. ఎవరంటే
ఈ ప్లేయర్ గురువు గౌతమ్ గంభీర్.. పేలవ ఫామ్ ఉన్నప్పటికీ ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఇక ఆ సాయాన్ని నిరూపిస్తే చాలాసార్లు జట్టుకు విజయాలు అందించాడు. అతడెవరో.. తాజాగా జరిగిన మ్యాచ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
టీమిండియా నయా కోచ్ గౌతమ్ గంభీర్.. తన కోచింగ్ ప్రయాణంలో ఎంతోమంది ఆటగాళ్లకు చాలా అవకాశాలు ఇచ్చాడు. అతడిలో సత్తా ఉందని అనిపిస్తే.. నిరంతరం ఫెయిల్ అవుతున్నా.. వరుసగా ఛాన్స్‌లు ఇస్తుంటాడు. ఆ కోవకు చెందిన ప్లేయర్ పంజాబ్ ఆల్‌రౌండర్ రమణదీప్ సింగ్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. దీంతో తాజా అతడి విధ్వంసానికి తిలక్ వర్మ సారధ్యం వహించిన హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓడింది.
డిసెంబర్ 1 ఆదివారం రోజున పంజాబ్, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలోని కొందరు స్టార్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. పంజాబ్‌కు చెందిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అభిషేక్ శర్మ.. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ పేలవ ప్రదర్శన కనబరిచారు. అయినప్పటికీ, ఈ మ్యాచ్‌లో దాదాపు 400 పరుగులు స్కోర్ నమోదైంది. ఇందులో పంజాబ్ 7 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించి తమ విజయాల పరంపరను కొనసాగించింది. ఇందులో రమణదీప్ 354 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
బౌలర్లపై విరుచుకుపడ్డ రమణదీప్..
రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్ సింగ్ కేవలం 36 బంతుల్లో 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు లోయర్ ఆర్డర్‌లో సన్వీర్ సింగ్ 14 బంతుల్లో 24 పరుగులు చేసినా.. రమణదీప్ స్టార్‌గా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 18వ ఓవర్ రెండో బంతికి ఎంట్రీ ఇచ్చాడు. ఆపై 11 బంతుల్లో అతను బౌలర్ల బ్యాండ్ వాయించాడు.
ఈ 27 ఏళ్ల బ్యాట్స్‌మెన్ 11 బంతుల్లో 354.55 స్ట్రైక్ రేట్‌తో 39 పరుగులు చేశాడు. ఇందులో 38 పరుగులు బౌండరీల రూపంలో వచ్చాయి. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం కోల్‌కతాను ఐపీఎల్ ఛాంపియన్‌గా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన రమణదీప్ సింగ్.. గంభీర్ కేకేఆర్‌లో ఉన్నప్పుడు.. ఆయన తన గురువు అని చెబుతూ ఉండేవాడు. ఈ ఇన్నింగ్స్‌తో కేకేఆర్ మాజీ మెంటర్, టీమ్ ఇండియా హెడ్ కోచ్‌పై తనకున్న గౌరవం ఎంతో మరోసారి రుజువు చేశాడు.
హైదరాబాద్ విజయానికి చేరువైంది..
ఇక హైదరాబాద్ గురించి చెప్పాలంటే.. గత కొన్ని వారాలుగా పరుగుల వర్షం కురిపించిన కెప్టెన్ తిలక్ వర్మ నుంచి జట్టు విజయం కోసం పెద్ద ఇన్నింగ్స్ అవసరమైంది. టీ20ల్లో వరుస సెంచరీలు సాధించిన తిలక్ ఈ మ్యాచ్‌లో ఏమీ చేయలేకపోయాడు. హైదరాబాద్ తరఫున ఓపెనర్ రోహిత్ రాయుడు 37 బంతుల్లో 56 పరుగులు, మిడిల్ ఆర్డర్‌లో మికిల్ జైస్వాల్ 23 బంతుల్లో 39 పరుగులు చేయగా.. మిగతా బ్యాట్స్‌మెన్లు అందరూ విఫలమయ్యారు. ఆ తర్వాత 9వ నంబర్ బ్యాట్స్‌మెన్ సివి మిలింద్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు, అతను కేవలం 22 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లతో 55 పరుగులు చేయడంతో హైదరాబాద్ 189 పరుగులకే చేరుకోగలిగింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..