Border-Gavaskar trophy: ఆ టీమిండియా బౌలర్ గురించి తన మనవాళ్ళు, మానవరాళ్లకు చెబుతానన్న ఆసీస్ బ్యాట్స్మెన్..
ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్‌తో పెర్త్ టెస్టులో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. హెడ్ తన కెరీర్‌లో అతన్ని ఎదుర్కొనడం గర్వంగా చెప్పుకోదగిన ఘట్టమని అభివర్ణించాడు.
ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ భారత స్టార్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ క్రికెట్లో ఉన్న గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా నిలుస్తాడని, అతన్ని ఎదుర్కొవడం పెద్ద సవాలుగా మారిందని అన్నాడు. అది తన కెరీర్‌లో గర్వంగా చెప్పుకోదగిన విషయమని తన మనవాళ్ళు మానవరాళ్లకు బుమ్రా గురించి చెబుతాను అని హెడ్ పేర్కొన్నాడు.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా తన అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. 8/72తో మ్యాచ్లో కీలక వికెట్లు సాధించి, తన ఫాస్ట్ బౌలింగ్ నైపుణ్యంతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు వెన్నులో వణుకు పుట్టించాడు. బుమ్రా ఈ ఏడాది టి20 ప్రపంచ కప్‌లో కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు, అక్కడ భారత జట్టుకు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
హెడ్ మాట్లాడుతూ, “అతన్ని ఎదుర్కొవడం ప్రతి బ్యాటర్‌కు పెద్ద సవాలే. అతను బ్యాటర్లను బలహీనంగా చేయగల సామర్థ్యం కలిగిన వ్యక్తి. అతనితో పోటీ పడటం నా కెరీర్‌లో ముఖ్యమైన సంఘటనలలో ఒకటి,” అని పేర్కొన్నాడు.
పెర్త్ టెస్టులో, హెడ్ స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే వంటి ఆటగాళ్లతో కూడిన టాప్ ఆర్డర్‌లో ఏకైక హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, అతని మిడిల్ ఆర్డర్ సహచరులు బ్యాటింగ్ చిట్కాల కోసం అతనిని సంప్రదించరని చెప్పాడు.
ఆస్ట్రేలియన్ జట్టు ఇప్పుడు తన తర్వాతి పింక్ బాల్ టెస్టును ఆడడానికి సిద్ధమవుతోంది. గత సిరీస్‌లలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను అధిగమించిన తమ సామర్థ్యం గురించి హెడ్ ధైర్యంగా మాట్లాడాడు. “ఈ జట్టు ప్రతికూల పరిస్థితులను చక్కగా ఎదుర్కొంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా, మేము సవాళ్లకు ఎదురు నిలిచి విజయాలను సాధించాము. పెర్త్ మ్యాచ్‌లో ఓడిపోయినా, మిగిలిన సిరీస్‌లో తాము తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తామని.. అని హెడ్ చెప్పాడు.
భారత జట్టు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఇది సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది.