Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: పాకిస్తాన్‌లో అడుగుపెట్టని రోహిత్ శర్మ.. కారణం ఏంటో తెలుసా?

Champions Trophy Opening Ceremony Cancelled: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభోత్సవం, కెప్టెన్ల ఫోటోషూట్ రద్దు చేయబడ్డాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు వారి బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోవడంతో భారత అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Champions Trophy: పాకిస్తాన్‌లో అడుగుపెట్టని రోహిత్ శర్మ.. కారణం ఏంటో తెలుసా?
Rohit Sharma Icc Champions Trophy
Follow us
Venkata Chari

|

Updated on: Jan 30, 2025 | 10:47 PM

Champions Trophy Opening Ceremony Cancelled: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈసారి హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ప్రారంభం కావడానికి చాలా రోజుల సమయం లేదు. ఈ మెగా ఈవెంట్‌లో 8 టీమ్‌లు పాల్గొనబోతున్నాయి. దీని ప్రారంభం గురించి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంతలో, Jio TV నుంచి ఒక కీలక వార్త వచ్చింది. దీని ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు ప్రారంభ వేడుక నిర్వహించడం లేదని తెలుస్తోంది.

ఫిబ్రవరి 16న లాహోర్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీ, పీసీబీ సంయుక్తంగా ఓపెనింగ్ వేడుకను నిర్వహించాలని యోచిస్తున్నాయని, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ కూడా దీనికి ఆమోదం తెలిపారని కొన్ని మీడియా నివేదికలలో వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లాల్సిన అవసరం లేదు..

ఓపెనింగ్ వేడుకతో పాటు ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్ కూడా రద్దు చేశారని తెలుస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తమ బిజీ షెడ్యూల్‌ల కారణంగా టోర్నీ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ చేరుకోవడానికి నిరాకరించినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జట్ల కెప్టెన్ల కోసం విలేకరుల సమావేశం కూడా ఉండదంట.

ఈ ఈవెంట్‌ల రద్దుతో భారత అభిమానులు కొంత వరకు సంతోషిస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడు ఈ ఈవెంట్‌లలో పాల్గొనడానికి రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్ళవలసిందిగా ఒత్తిడి ముగిసింది. అంతకుముందు కూడా పాకిస్థాన్ వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనేందుకు ఇంగ్లండ్ జట్టు ఫిబ్రవరి 18న లాహోర్ చేరుకుంటుందని ఈ నివేదికలో పేర్కొంది. కాగా, ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరి 19న పాకిస్థాన్‌లో అడుగుపెట్టనుంది. బంగ్లాదేశ్, భారత్ జట్టు ఫిబ్రవరి 15 న దుబాయ్ చేరుకోనుండగా, ఆఫ్ఘనిస్తాన్ ఫిబ్రవరి 12 న ఇస్లామాబాద్ చేరుకుంటుంది.

అదే సమయంలో, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు మిగిలిన జట్ల కంటే ముందే పాకిస్తాన్‌కు చేరుకుంటాయి. ఎందుకంటే, ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు లాహోర్, కరాచీలలో ముక్కోణపు ODI సిరీస్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడవు..

నివేదిక ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకూడదని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు నిర్ణయించుకున్నాయి. రెండు జట్లు నేరుగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి. ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉందని, ఫిబ్రవరి 12న జరిగే వన్డే మ్యాచ్ తర్వాత దాని పర్యటన ముగుస్తుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..