Rohit Sharma : వార్నర్, సచిన్ సరసన రోహిత్.. ఆసీస్‌పై వన్డేల్లో 33వ సెంచరీ సాధించిన హిట్ మ్యాన్
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ అద్భుతమైన, మ్యాచ్ విన్నింగ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో తన 33వ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్, అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 50 సెంచరీల మైలురాయిని చేరుకోవడం విశేషం.

Rohit Sharma : ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ అద్భుతమైన, మ్యాచ్ విన్నింగ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో తన 33వ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్, అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 50 సెంచరీల మైలురాయిని చేరుకోవడం విశేషం. అతని మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ విజయం దిశగా సునాయాసంగా దూసుకెళ్లింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, హిట్‌మ్యాన్ టీమ్‌ఇండియాకు బలమైన పునాది వేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 105బంతుల్లో మెరుపు సెంచరీ నమోదు చేశాడు. రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్‌లో 11 బౌండరీలు, 2 భారీ సిక్సర్లు కొట్టాడు. అతని మ్యాచ్ విన్నింగ్ సెంచరీ కారణంగా భారత జట్టు విజయం దిశగా సునాయాసంగా పయనించింది.
ఈ సెంచరీతో రోహిత్ శర్మ ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇది వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మకు 33వ సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, T20) కలిపి రోహిత్ ఖాతాలో ఇప్పుడు మొత్తం 50 సెంచరీలు నమోదయ్యాయి. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ ఒకడు.
సచిన్, కోహ్లీ సరసన రోహిత్
అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీల మైలురాయిని చేరుకోవడం ద్వారా రోహిత్ శర్మ.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి భారత దిగ్గజాల సరసన చేరాడు. అతని ఈ ప్రదర్శన భారత క్రికెట్‌లో అతని స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. ఈ మ్యాచ్‌లో సాధించిన విజయం, రోహిత్ సెంచరీ ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు శుభసూచకం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




