Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్

Rinku Singh May be X Factor In Champions Trophy: ప్రస్తుతం టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. జనవరి మూడో వారం నుంచి ఇంగ్లండ్ జట్టులో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారనున్న ఆటగాడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Jan 06, 2025 | 12:34 PM

Rinku Singh May be X Factor In Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్‌లో ప్రారంభమవుతుంది. అయితే, భారత జట్టు తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించదు. అందుకే, టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు 2017 ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని టీమ్ ఇండియా ప్రయత్నిస్తోంది.

ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టులో పవర్‌ఫుల్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ కూడా ఎంపిక కావచ్చు. అతను ఎంపికైతే జట్టు తరుపున కీలక పాత్ర పోషించగలడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియాకు రింకూ సింగ్ ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..

3. మ్యాచ్‌కు ఊహించని ఫినిషింగ్ ఇచ్చే సామర్థ్యం..

రింకూ సింగ్ మ్యాచ్‌లను బాగా ముగించడం తెలిసిన ఆటగాడు. వన్డే క్రికెట్‌లో, అవసరమైనప్పుడు భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్‌ని ముగించగల ఆటగాళ్లు కావాలి. ముఖ్యంగా చివరి 10 ఓవర్లలో రింకూ సింగ్ లాంటి బ్యాట్స్‌మెన్ అవసరం చాలా ఎక్కువ. జట్టు స్కోర్ 8-9 రన్ రేట్‌కు దిగితే రింకూ సింగ్ పటిష్టమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించే సత్తా ఉంది.

ఇవి కూడా చదవండి

2. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే సామర్థ్యం..

అటాకింగ్ మోడ్‌లో మాత్రమే ఆడటం రింకూ సింగ్‌కు తెలుసు అని కాదు. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే సత్తా కూడా అతనికి ఉంది. దేశవాళీ క్రికెట్‌లో ఈ ఘనత సాధించాడు. చాలా సార్లు వన్డేల్లో బ్యాట్స్‌మెన్ కొంత సమయం ఆడవలసి వస్తుంది. క్రీజులో కుదురుకోవడం, ఆ తర్వాత దుమ్మురేపడం రింకూ సింగ్‌కు వెన్నతో పెట్టిన విద్య.

1. ఏ క్షణంలో బరిలోకి దిగినా, గేర్ మార్చేస్తాడంతే..

రింకూ సింగ్ ఎప్పుడైనా తన గేర్‌ని మార్చడం ద్వారా మ్యాచ్‌ను తనకు అనుకూలంగా మార్చుకోగలడు. అతను అవసరమైతే ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడమే కాకుండా, చివరి కొన్ని ఓవర్లలో లేదా మిడిల్ ఓవర్లలో అవసరాన్ని బట్టి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయగలడు. ఈ కారణంగా జట్టులో అతని ప్రాముఖ్యత గణనీయంగా పెరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి