Sanju Samson: శాంసన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్.. కారణం ఏంటంటే?
Team India: టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. జనవరి 22 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ముందుగా టీ20 సిరీస్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. అయితే, టీ20 సిరీస్ ఆడనున్న శాంసన్, వన్డే జట్టు నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే, ఛాంపియన్స్ ట్రోపీ ఆడే అవకాశాలు కూడా తగ్గిపోయినట్లేనని తెలుస్తోంది.

Sanju Samson: ఆస్ట్రేలియా టెస్టు పర్యటన ముగిసిన తర్వాత, ఇప్పుడు భారత జట్టు పరిమిత ఓవర్ల సవాలును ఎదుర్కొంటుంది. ఈ నెలాఖరులో టీ20, వన్డే సిరీస్‌లకు భారత్ ఇంగ్లండ్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. త్వరలో జరగనుంది వన్డే జట్టును ఎంపిక చేయనున్నారు. కానీ, సంజూ శాంసన్ అభిమానులకు ఖచ్చితంగా షాక్ ఉండనుంది. నిజానికి గతేడాది టీ20 ఇంటర్నేషనల్‌లో నిలకడగా రాణిస్తున్న శాంసన్‌కు వన్డే జట్టులో చోటు దక్కేలా కనిపించడం లేదు.
ఇటీవలి నివేదికల ప్రకారం, ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టులో శాంసన్ స్థానం ఫిక్స్ అయింది. అయితే, అతను వన్డే సిరీస్ నుంచి తప్పించే ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో శాంసన్ ఆడకపోతే.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడం కష్టమే. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి రిషబ్ పంత్ సెలక్టర్ల మొదటి ఎంపికగా మారింది.
ఈ కారణంగానే సంజూ శాంసన్ వన్డే జట్టులోకి ఎంపిక కాలేదా?
వన్డే జట్టులో శాంసన్ ఎంపిక కాకపోవడానికి ప్రధాన కారణం అతను విజయ్ హజారే ట్రోఫీలో ఆడకపోవడం. నిజానికి, కేరళ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడిన తర్వాత, విజయ్ హజారే ట్రోఫీ కోసం శాంసన్ జట్టులో ఎంపిక కాలేదు. టోర్నీ ప్రారంభానికి ముందు వాయనాడ్‌లో జరిగిన మూడు రోజుల శిక్షణా శిబిరానికి శాంసన్ హాజరుకాలేదు. దీంతో అతడిని జట్టులోకి తీసుకోకూడదని బోర్డు నిర్ణయించింది.
తాను అందుబాటులో ఉన్నట్లు ప్రకటించిన శాంసన్..
అయితే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ బోర్డు అతని ప్రకటనను పూర్తిగా విస్మరించింది. ఏది ఏమైనా కేరళ జట్టు టోర్నీలో గ్రూప్ స్టేజ్ దాటి వెళ్లలేక పోవడంతో ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు ఎలాంటి క్రికెట్ ఆడాలనే ఆశ కూడా శాంసన్ కు మిగలడం లేదు. టీ-20 సిరీస్‌లో శాంసన్ చాలా బాగా రాణిస్తే, బహుశా అతనికి అవకాశం ఉండవచ్చు. కానీ, ప్రస్తుత అప్‌డేట్‌ల ప్రకారం, శాంసన్స్ వన్డే క్రికెట్‌లో మరోసారి నిరాశ చెందాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








