Viral Video: 8 ఫోర్లు, 7 సిక్సులు.. 213 స్ట్రైక్‌రేటుతో బీభత్సం.. ఒకే ఓవర్‌లో బౌలర్ తాట తీసిన కోహ్లీ సహచరుడు.. ఎవరంటే?
5 Sixes in Over: సిక్సర్ల వర్షం కురిపించిన ఈ ఆటగాడిని వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతను IPL-2023 నుంచి వైదొలగవలసి రావడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు.

Will Jacks, 5 Sixes in an Over: టీ20 క్రికెట్ ఎంట్రీ ఇచ్చాక.. ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ అందుతోంది. ఫోర్లు, సిక్స్‌ల మోతలతో మైదానంలో ఉత్సాహం పీక్స్‌కి చేరుతోంది. ఈ ఇన్‌స్టంట్ క్రికెట్ ఆధిపత్యం పెరిగిపోవడంతో అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు మరింతగా రెచ్చిపోయే ఛాన్స్ కూడా పెరిగింది. టెస్టుల్లో కూడా ఫోర్లు, సిక్సర్లు బాదడంలో బ్యాట్స్‌మెన్ వెనుకంజ వేయడం లేదు. ఓ ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ వేగంగా మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి సంచలనంగా మారాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
సిక్సుల వర్షం కురిపించిన ఆర్సీబీ ప్లేయర్..
సిక్సర్ల వర్షం కురిపించిన ఈ ఆటగాడిని వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతను IPL-2023 నుంచి వైదొలగవలసి రావడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఐపీఎల్‌లో, గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి చరిత్ర పుటల్లో లిఖించుకున్న రింకూ సింగ్‌లాగే.. విల్ జాక్స్ కూడా వైటాలిటీ బ్లాస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.




ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు..
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 లీగ్ వైటాలిటీ బ్లాస్ట్‌లో విల్ జాక్వెస్ అద్భుత ప్రదర్శన చేశాడు. మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్రే ఓపెనర్ విల్ జాక్స్ ఒకే ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాదాడు. అయితే కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.
5 consecutive sixes by Will Jacks in a single over.
RCB player to watch out in IPL 2024.pic.twitter.com/L6hc1r7UWe
— Johns. (@CricCrazyJohns) June 22, 2023
అయినా ఓడిన జాక్స్ జట్టు..
అయితే, మిడిల్‌సెక్స్ జట్టు సర్రేని 7 వికెట్ల తేడాతో ఓడించింది. సర్రే జట్టు 7 వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు చేయగా, మిడిల్‌సెక్స్ 3 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సాధించింది. సర్రే ఇన్నింగ్స్‌లోని 11వ ఓవర్‌లో, లెగ్ స్పిన్నర్ ల్యూక్ హాల్‌మన్ వేసిన మొదటి 5 బంతుల్లో విల్ జాక్ 5 సిక్సర్లు కొట్టాడు. 2019లో, దుబాయ్‌లో జరిగిన ప్రీ-సెషన్ T10 మ్యాచ్‌లో లంకేషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో జాక్వెస్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
