IND vs NZ 2nd ODI: రద్దయిన మ్యాచ్‌లో గ్రౌండ్ స్టాఫ్‌కు సహకరించిన భారత యువ ఆటగాళ్లు.. వైరల్ అవుతున్న ఫొటోలు.. రాజస్థాన్ టీమ్ ఎలా స్పందించిందంటే..?

హామిల్టన్ వేదికగా ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డే వర్షం కారణంగా అంతరాయం ఏర్పడటంతో మ్యాచ్‌ రద్దయింది. అయితే మొదటగా బ్యాటింగ్ వచ్చిన భారత్ ఇన్నింగ్స్ 4.5 ఓవర్ల వద్ద ఉన్నప్పుడు

IND vs NZ 2nd ODI: రద్దయిన మ్యాచ్‌లో గ్రౌండ్ స్టాఫ్‌కు సహకరించిన భారత యువ ఆటగాళ్లు.. వైరల్ అవుతున్న ఫొటోలు.. రాజస్థాన్ టీమ్ ఎలా స్పందించిందంటే..?
Suryakumar Yadav, Sanju Sam
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 28, 2022 | 9:29 AM

హామిల్టన్ వేదికగా ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డే వర్షం కారణంగా అంతరాయం ఏర్పడటంతో మ్యాచ్‌ రద్దయింది. అయితే మొదటగా బ్యాటింగ్ వచ్చిన భారత్ ఇన్నింగ్స్ 4.5 ఓవర్ల వద్ద ఉన్నప్పుడు కొంత సమయం వర్షం పడింది. దాంతో ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్ బాట పట్టారు. గ్రౌండ్ దెబ్బతినకుండా  సెడాన్ పార్క్ గ్రౌండ్ స్టాఫ్ చర్యలు తీసుకుంటన్నప్పుడు.. సహాయం చేయడానికి భారత ఆటగాళ్లు కూడా వారితో  చేరారు. వర్షం పడినప్పుడు భారత యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ హామిల్టన్‌లోని గ్రౌండ్ స్టాఫ్‌కు సహాయం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను న్యూజిలాండ్ క్రికెట్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ కావడంతో ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ దృష్టిన పడ్డాయి. దీంతో ఆ టీమ్ స్పందిస్తూ ‘‘ సంజూ సామ్సన్ (పింక్ లవ్ సింబల్‌తో కలిపి)’’ అంటూ ట్వీట్ చేసింది.

అయితే రెండవ వన్డే మ్యాచ్‌లో శాంసన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వన్డే తాత్కాలిక సారథి శిఖర్ ధావన్ అతని స్థానంలో దీపక్ హుడాను జట్టులోకి తీసుకున్నాడు. ఈ నిర్ణయం చాలా మంది క్రికెట్ అభిమానులకు నచ్చలేదనే చెప్పుకోవాలి. మొదటి మొదటి వన్డేలో శాంసన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కానీ వర్షం కారణంగా రద్దయిన రెండో వన్డేలో అతనికి స్థానం లభించలేదు. మరోవైపు శాంసన్‌కు సరైన అవకాశాలు ఇవ్వడంలేదంటూ బీసీసీఐపై భారత క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ రాయల్స్ స్పందన..

కాగా, మ్యాచ్ ఆలస్యంగా మొదలైన తర్వాత కూడా వర్షం పడడంతో 4.9 ఓవర్ల వద్ద ఆట ఆగింది. కొంత సమయం తర్వాత మ్యాచ్‌ను 29 ఓవర్లకు తగ్గించుకుని ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. అయితే 12.5 ఓవర్ల ఆట సమయంలో వర్షం తిరిగి ప్రారంభమైంది. చాలా సేపు నిరిక్షించిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లతో ఎంపైర్లు చర్చించి.. రెండో వన్డే మ్యాచ్‌ను రద్దుచేశారు. ఇందులో ధావన్(3), శుభమాన్ గిల్(45), సూర్యకుమార్ యాదవ్(34) పరుగులు చేయగా న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ శిఖర్ ధావన్ రూపంలో ఒక వికెట్‌ను పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..