IND vs NZ 3rd ODI: మూడో వన్డేకి అడ్డుపడనున్న వరుణుడు..? అదే జరిగితే సిరీస్ ఏం అవుతుంది..? తెలుసుకోండి..
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్ బుధవారం(నవంబర్ 30) అతిథ్య జట్టుతో మూడో వన్డే మ్యాచ్ ఆడనుంది. క్రీస్ట్‌చర్చ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండు వన్డేలలో మొదటి...
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్ బుధవారం(నవంబర్ 30) అతిథ్య జట్టుతో మూడో వన్డే మ్యాచ్ ఆడనుంది. క్రీస్ట్‌చర్చ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండు వన్డేలలో మొదటి వన్డేలో న్యూజిలాండ్ గెలవగా, రెండోది వర్షం కారణంగా రద్దయింది. న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరిగుగున్న మూడు వన్డేల ఈ సిరీస్‌లో ప్రసుతం కివీస్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. కంటి ముందున్న ఈ పరిస్థితుల్లో సిరీస్‌ను గెలుచుకునే అవకాశం భారత్‌కు లేకపోయినా, సమం చేసుకునే అవకాశం ఉంది. అయితే దానికోసం చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా గెలిచి తీరాలి. అప్పుడే 1-1 గా సిరీస్ సమం అవుతుంది.
కానీ బుధవారం జరిగే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశం ఉందని న్యూజిలాండ్ వాతావరణ శాఖ అంటోంది. టీమ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఈ మూడో వన్డే మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 7:00 గంటలకు, న్యూజిలాండ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ మ్యాచ్ జరిగే సమయానికి క్రీస్ట్‌చర్చ్‌లో వర్షం కురిసేందుకు 70 శాతం అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే సిరీస్ న్యూజిలాండ్ సొంతం అవుతుంది. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డురాకుడని క్రికెట్ అభిమానులు వరుణుడిని ప్రార్థిస్తున్నారు.
భారత్ vs న్యూజిలాండ్ మూడో వన్డే వాతావరణ సూచన..
క్రైస్ట్‌చర్చ్‌లో నవంబర్ 30, బుధవారం నాడు జరిగే మ్యాచ్ సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. హగ్లీ ఓవల్ వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు మూడో మ్యాచ్‌లో తలపడనున్నాయి. తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓడిన భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..