- Telugu News Photo Gallery Cricket photos Indian Player Surya Kumar Yadav Become the top player to score 50 plus scores many times in a year
Surya Kumar Yadav: దిగ్గజ ప్లేయర్ల సరసనకు చేరిన సూర్య.. అతను నెలకొల్పిన నయా రికార్డు ఏమిటంటే..?
టీమ్ ఇండియా తరఫున సూర్యకుమార్ యాదవ్ ఒక నయా రికార్డును నెలకొల్పాడు. అదేమిటంటే.. భారత జట్టు కోసం ఒక సంవత్సరంలో అత్యధిక 50+ స్కోర్‌లను చేసిన జాబితాలో టాప్‌లో..
Updated on: Nov 28, 2022 | 2:05 PM

టీమ్ ఇండియా తరఫున సూర్యకుమార్ యాదవ్ ఒక నయా రికార్డును నెలకొల్పాడు. అదేమిటంటే.. భారత జట్టు కోసం ఒక సంవత్సరంలో అత్యధిక 50+ స్కోర్‌లను చేసిన జాబితాలో టాప్‌లో నిలిచాడు. దీంతో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజ ప్లేయర్ల సరసన చేరాడు.

మూడు రకాల ఫార్మాట్లున్న అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున ఏడాదిలో 50కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో పలువురు ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలోకి సూర్యకుమార్ యాదవ్ కొత్తగా చేరాడు.

అయితే ఒక్క ఏడాదిలో భారత్ తరఫున ఎక్కువ సార్లు 50+ పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం..

గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. భారత ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ మొత్తం 19 సెంచరీలు సాధించాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగే వీరేంద్ర సెహ్వాగ్ కూడా మొత్తం 18 సెంచరీలు చేశాడు. ఈ ఇద్దరు దిగ్గజాలను ఇప్పుడు హిట్ మ్యాన్ అధిగమించడం విశేషం.

టీ20 క్రికెట్: పొట్టి క్రికెట్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్ 2022లో 11 సార్లు 50 ప్లస్ స్కోర్‌ను చేశాడు. దీంతో టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్‌లో ఒక ఏడాదిలో అత్యధిక సార్లు 50+ స్కోర్‌ను సాధించిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు.





























