Acid Attack: భార్య ముఖంపై యాసిడ్‌తో దాడి చేసిన భర్త.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే..?

రాంచీ జిల్లాలో ఓ భర్త తన భార్యపై యాసిడ్ పోసి చంపేందుకు యత్నించాడు. యాసిడ్ దాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడకు వచ్చిన..

Acid Attack: భార్య ముఖంపై యాసిడ్‌తో దాడి చేసిన భర్త.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే..?
Acid Attack
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 28, 2022 | 8:24 AM

జార్ఖండ్‌ రాజధాని నగరంలో యాసిడ్ దాడి కలకలం రేపింది.   మరో దారుణ ఘటన వెలుగు చూసింది. రాంచీ జిల్లాలో ఓ భర్త తన భార్యపై యాసిడ్ పోసి చంపేందుకు యత్నించాడు. యాసిడ్ దాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడకు వచ్చిన చుట్టుపక్కలవారు ఆమెను రిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. హీనాపై దాడి చేసినది ఆమె భర్త అమీర్‌ అని వారు గుర్తించారు. ప్రస్తుతం ఆ మహిళ రిమ్స్‌లోని కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. కుటుంబ కలహాలతో నిందితుడు తన భార్య హీనాపై యాసిడ్ పోశాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దాడి జరిగిన వెంటనే అతను ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఆమెను రిమ్స్‌లోని బర్న్ వార్డులో చేర్చారు.

బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం ఉదయం హీనా తన ముఖం కడుక్కుంటుండగా అమీర్ వచ్చి ఆకస్మికంగా యాసిడ్‌తో ఆమె ముఖంపై పోసాడు. హీనా అత్త చూస్తుండగానే ఆమెపై యాసిడ్ పోసిన అమీర్ అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. బాధితురాలి అత్త కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూశారు. హీనాను చూసిన వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై హీనా అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అమీర్‌పై పలు సెక్షన్ల కింద కేసుక నమోదు చేసుకుని, అతన్ని తప్పక శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.  అమీర్‌ను పట్టుకునేందుకు వారు గాలిస్తున్నారు.

అయితే హీనా, అమీర్‌ల వివాహం జరిగి 10 సంవత్సరాలు అయిందని వారి బంధువులు తెలిపారు. ఇంకా వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, పెళ్లయిన కొంత కాలం అంతా సవ్యంగానే సాగారని అన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని నిందితుడు అమీర్ డ్రగ్స్ తీసుకుంటూ భార్య హీనాను కొట్టేవాడని వారు పోలీసులకు తెలిపారు.  అతను ఎప్పుడూ ఆమె నుంచి డబ్బు డిమాండ్ చేసేవాడని చెప్పారు. ఇదే క్రమంలో ఆమెకు విడాకులు ఇవ్వాలని అమీర్ భావించాడని, అయితే పెద్దల మాట్లాడడంతో అతను వెనక్కి తగ్గాడని బంధువులు, స్థానికులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..