IPL 2024: ఐపీఎల్ వేలంలో అన్‌ సోల్డ్‌.. కట్‌ చేస్తే.. టీ20ల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ సెంచరీలతో విధ్వంసం

వికెట్ కీపర్ అండ్‌ బ్యాటరైన ఫిల్ సాల్ట్ ఈ ఐపీఎల్ వేలంలోనూ తన పేరు నమోదు చేసుకున్నాడు. రూ1.5 కోట్లు బేస్‌ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. అయితే ఏ ఫ్రాంచైజీ ఈ ఇంగ్లండ్ బ్యాటర్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. అయితే ఐపీఎల్‌ వేలం ముగిసిన తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ బ్యాట్ ఝుళిపించాడు.

IPL 2024: ఐపీఎల్ వేలంలో అన్‌ సోల్డ్‌.. కట్‌ చేస్తే.. టీ20ల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ సెంచరీలతో విధ్వంసం
Phil Salt
Follow us
Basha Shek

|

Updated on: Dec 20, 2023 | 9:30 PM

ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2024 మినీ వేలంలో అమ్ముడుపోని ఈ డ్యాషింగ్‌ బ్యాటర్‌ పొట్టి ఫార్మాట్లో బ్యాక్‌ టు బ్యాక్‌ సెంచరీలు కొట్టి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు గట్టి హెచ్చరికలు పంపాడు. వికెట్ కీపర్ అండ్‌ బ్యాటరైన ఫిల్ సాల్ట్ ఈ ఐపీఎల్ వేలంలోనూ తన పేరు నమోదు చేసుకున్నాడు. రూ1.5 కోట్లు బేస్‌ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. అయితే ఏ ఫ్రాంచైజీ ఈ ఇంగ్లండ్ బ్యాటర్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. అయితే ఐపీఎల్‌ వేలం ముగిసిన తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ బ్యాట్ ఝుళిపించాడు. అది కూడా మెరుపు ఇన్నింగ్స్ ద్వారా. ఈ మ్యాచ్‌లో సాల్ట్ 57 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 119 పరుగులు చేశాడు. దీనితో పాటు, ఫిల్ సాల్ట్ T20 క్రికెట్‌లో బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు చేసిన ప్రపంచంలో మూడవ బ్యాటర్‌ గా అలాగే ఇంగ్లాండ్ జట్టు మొదటి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతుకు ముందు వెస్టిండీస్‌తో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో సాల్ట్ అజేయంగా 109 పరుగులు చేశాడు.

సూపర్‌ ఫామ్‌లో ఉన్నప్పటికీ, ఫిల్ సాల్ట్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీని తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్ మరో సెంచరీతో చెలరేగాడు. దీని ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తన బ్యాట్ ద్వారా స్పష్టమైన సందేశం పంపాడు. ఫిల్ సాల్ట్ గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. మొత్తం 9 ఇన్నింగ్స్‌లు ఆడిన సాల్ట్ 163.91 స్ట్రైక్ రేట్‌తో 218 పరుగులు చేశాడు. అయితే ఈసారి అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఫిల్ సాల్ట్ ఇప్పుడు సంచలన సెంచరీ చేయడం ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. అందుకే ఐపీఎల్ సీజన్-17లో మళ్లీ ప్లేయర్‌గా అడుగుపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఫిల్ సాల్ట్ ఈ అద్భుత సెంచరీ సాయంతో ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. ఈ భారీ స్కోరును ఛేదించిన వెస్టిండీస్ జట్టు 15.3 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. మొదటి ఇంగ్లండ్ బ్యాటర్ గా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..