IPL 2024: ఒకే పేరుతో ఇద్దరు క్రికెటర్లు.. పప్పులో కాలేసిన ప్రీతి.. ఒకరి బదులు మరొకరి కొనుగోలు.. వీడియో

పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తన తొందరపాటు నిర్ణయంతో ఒక పెద్ద పొరపాటు చేసింది. కొనుగోలు చేయాలనుకున్న ప్లేయర్‌ని వదిలేసి తమ ప్లాన్‌లో లేని మరో ప్లేయర్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.20 లక్షలు ధారపోయాల్సి వచ్చింది.

IPL 2024: ఒకే పేరుతో ఇద్దరు క్రికెటర్లు.. పప్పులో కాలేసిన ప్రీతి.. ఒకరి బదులు మరొకరి కొనుగోలు.. వీడియో
Preity Zinta, Punjab Kings
Follow us

|

Updated on: Dec 20, 2023 | 8:33 PM

దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో పలు ఆశ్చర్యకర సంఘటనలు, పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు ఆటగాళ్లు ఏకంగా 20 కోట్లకు పైగా అందుకున్నారు. మరికొందరు ఆటగాళ్లు ఆశించిన ధరను పొందగా, స్వదేశీ క్రికెటర్లకు అదృష్టం తలుపులు తెరిచాయి. అలాగే చాలా మంది యువ ప్రతిభావంతులు ఊహించిన దాని కంటే ఎక్కువ ధర అందుకున్నారు. కానీ ఇంతలోనే పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తన తొందరపాటు నిర్ణయంతో ఒక పెద్ద పొరపాటు చేసింది. కొనుగోలు చేయాలనుకున్న ప్లేయర్‌ని వదిలేసి తమ ప్లాన్‌లో లేని మరో ప్లేయర్‌ను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.20 లక్షలు ధారపోయాల్సి వచ్చింది. నిజానికి మినీ వేలం చివరి దశలో దేశవాళీ క్రికెటర్ల సెట్ వేలానికి వచ్చింది. ఈసారి వేలంలో ఛత్తీస్‌గఢ్‌ తరఫున ఆడుతున్న 32 ఏళ్ల శశాంక్‌ సింగ్‌ పేరును వేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్‌ తీసుకుంది. పంజాబ్ కింగ్స్ మొదట శశాంక్ సింగ్ కోసం పోటీపడింది. 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. కానీ పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయాలనుకున్న ఆటగాడు వేరు. వేలంలో కొనుగోలు చేసిన ఆటగాడు భిన్నంగా ఉన్నాడు. , పంజాబ్ కింగ్స్ తమ తప్పును చాలా ఆలస్యంగా గ్రహించారు. ఫ్రాంచైజీ వెంటనే వేలాన్ని నిలిపివేసి, బిడ్డింగ్ సమయంలో జరిగిన పొరపాటు గురించి వేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్‌కు వివరించే ప్రయత్నం చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్‌ని కొనుగోలు చేసిన తర్వాత నిర్ణయం మార్చుకోలేమని మల్లికా సాగర్ ఫ్రాంచైజీకి తేల్చి చెప్పారు. దీంతో తమ ప్లాన్‌లో లేకపోయిన ఆటగాడిని పంజాబ్ కొనుగోలు చేయాల్సి వచ్చింది.

నిజానికి 19 ఏళ్ల శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేయాలన్నది పంజాబ్‌ ఫ్రాంచైజీ ఉద్దేశం. ఇద్దరు ఆటగాళ్ల పేర్లే కాకుండా ఇద్దరి బేస్ ప్రైస్ కూడా ఒకేలా ఉండడమే ఈ గందరగోళానికి కారణం. తద్వారా 19 ఏళ్ల శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేయాలని భావించిన పంజాబ్, తమ ప్రణాళికలో భాగం కాని ఛత్తీస్‌గఢ్ తరఫున ఆడుతున్న 32 ఏళ్ల శశాంక్ సింగ్‌ను చేర్చుకోవాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 32 ఏళ్ల శశాంక్ సింగ్ ఆల్ రౌండర్. అతను గతంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. 2023 వేలానికి ముందు అతన్ని సన్‌రైజర్స్ విడుదల చేసింది. ఆ తర్వాత 2023లో జరిగిన వేలంలో ఏ జట్టు కూడా అతడిని కొనుగోలు చేయలేదు. వేలం సమయంలో పంజాబ్ చేసిన తప్పిదంతో మరోసారి వేలంలో పేరు నమోదు చేసుకున్న శశాంక్‌కు కొనుగోలుదారు దొరికాడు. శశాంక్ సింగ్ ఇప్పటి వరకు 10 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా ఈ మ్యాచ్‌ల్లో 69 పరుగులు మాత్రమే చేశాడు.

ఇవి కూడా చదవండి

పంజాబ్ కింగ్స్ జట్టు

నిలబెట్టుకున్న ఆటగాళ్లు:

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, అథర్వ తేదే, అర్షదీప్ సింగ్, రిషి ధావన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరణ్, సికిందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడ, నాథన్ భట్రియా, హర్‌ప్రీత్ ఎల్లిస్ , విద్వత్ కవీరప్ప.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, ప్రిన్స్ చౌదరి, తనయ్ త్యాగరాజన్, రిలే రోసోవ్, శశాంక్ సింగ్.