IND vs SA: మూడో వన్డేలో కీలక మార్పులు.. సిరీస్ గెలిస్తే చరిత్ర.. ఓడితే చెత్త రికార్డ్..

IND vs SA: మూడో వన్డే పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కడం ఖాయం. రెండో వన్డే మ్యాచ్‌లో జడ్డూకు బదులుగా అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. కారణం, అక్షర్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నిరాశపరిచాడు. బ్యాటింగ్‌లో 7 పరుగులు మాత్రమే చేసిన అక్షర్ ఇందుకోసం 23 బంతులు ఎదుర్కొన్నాడు.

IND vs SA: మూడో వన్డేలో కీలక మార్పులు.. సిరీస్ గెలిస్తే చరిత్ర.. ఓడితే చెత్త రికార్డ్..
Ind Vs Sa 3rd Odi
Follow us
Venkata Chari

|

Updated on: Dec 21, 2023 | 7:11 AM

IND vs SA 3rd ODI: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో వన్డేలో భారత్‌ (Team India) ను 8 వికెట్ల తేడాతో ఓడించి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదటగా ఈ సిరీస్‌లోని తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా (India vs South Africa) 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. కానీ, రెండో వన్డే మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో మూడో మ్యాచ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టులో మార్పు చేసే అవకాశం ఉంది. దీని ప్రకారం, ఏ ఆటగాళ్లకు మొండిచేయి చూపిస్తారో చూడాలి. అలాగే, జట్టులో ఏ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందో చూడాలి.

భారత జట్టులో మార్పు ఖాయం..

మూడో వన్డే పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కడం ఖాయం. రెండో వన్డే మ్యాచ్‌లో జడ్డూకు బదులుగా అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. కారణం, అక్షర్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నిరాశపరిచాడు. బ్యాటింగ్‌లో 7 పరుగులు మాత్రమే చేసిన అక్షర్ ఇందుకోసం 23 బంతులు ఎదుర్కొన్నాడు. అలాగే బౌలింగ్‌లో అక్షర్ 6 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేదు.

భారత్‌ ఘోర పరాజయం..

రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచారు. తొలి మ్యాచ్‌లో బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కానీ, రెండో మ్యాచ్‌లో 212 పరుగులు చేసినా.. భారత బౌలర్లు పేలవ ప్రదర్శనతో స్కోర్‌ను ఢిపెండింగ్ చేయలేకపోయారు. తొలి వన్డేలో ఐదు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ ఇక్కడ ఒక్క వికెట్ తీసుకున్నా జట్టు విజయానికి సరిపోలేదు. ఎందుకంటే ఈ వికెట్ పడిపోవడమే ఆలస్యమైంది. చివరగా రింకూ సింగ్ ఒక వికెట్ తీసి తన అంతర్జాతీయ వికెట్ ఖాతా తెరిచాడు. ఈ మ్యాచ్‌లో ఆఫ్రికా 8 వికెట్ల తేడాతో సులభంగా గెలిచింది. ఆఫ్రికా తరుపున ఓపెనర్ టోనీ డిజార్జ్ సెంచరీ చేశాడు.

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), సంజు శాంసన్, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!