PBKS vs GT IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ XIలో ఎంట్రీ ఇచ్చిన డేంజరస్ ప్లేయర్స్.. ఇక దబిడ దిబిబే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు గుజరాత్ టైటాన్స్ (GT), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య లీగ్ దశ మ్యాచ్ మొదలైంది. మొహాలీలోని పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడగా, 2 గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయాయి.
Punjab Kings vs Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు గుజరాత్ టైటాన్స్ (GT), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య లీగ్ దశ మ్యాచ్ మొదలైంది. మొహాలీలోని పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడగా, 2 గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయాయి.
ఈ క్రమంలో టాస్ గెలిచిన హార్దిక్ సారథ్యంలోని గుజరాత్ టీం తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ లీగ్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌కి ఇది రెండో సీజన్ మాత్రమే. గత సీజన్‌లో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఓసారి గుజరాత్, మరోసారి పంజాబ్ విజయం సాధించాయి.
ఇరు జట్ల ప్లేయింగ్ XI..
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ(కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..