ICC T20I Rankings: కోహ్లీ రికార్డును తుడిచేసిన బాబర్‌.. ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల స్థానాలేంటంటే..

ICC T20I Rankings: అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ ( Virat Kohli) సాధించిన రికార్డులను ఒక్కొక్కటి అధిగమిస్తున్నాడు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ (Babar Azam). తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం పాటు నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు..

ICC T20I Rankings: కోహ్లీ రికార్డును తుడిచేసిన బాబర్‌.. ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల స్థానాలేంటంటే..
Virat Kohli
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 30, 2022 | 9:50 AM

ICC T20I Rankings: అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ ( Virat Kohli) సాధించిన రికార్డులను ఒక్కొక్కటి అధిగమిస్తున్నాడు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ (Babar Azam). తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం పాటు నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 1, 013 రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగగా.. తాజాగా బాబర్‌ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఏడాది కేవలం 2 టీ20లు మాత్రమే ఆడిన విరాట్‌ తాజా ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు. మరోవైపు బాబర్ మాత్రం అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ర్యాంకింగ్స్‌ లో రేటింగ్‌ పాయింట్లను మెరుగుపర్చుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో బాబర్‌ తర్వాత రెండో ప్లేస్‌లో పాక్‌ వికెట్‌కీపర్‌ మహ్మద్ రిజ్వాన్ (794) కొనసాగుతున్నాడు. రిజ్వాన్‌కు బాబర్‌కు మధ్య 24 రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసం ఉంది.

ఇక ఈ జాబితా టాప్‌ -10లో టీమిండియా నుంచి ఇషాన్‌ కిషన్‌ (682) కు మాత్రమే స్థానం లభించింది. గత వారం ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో ఉన్న ఇషాన్‌.. తాజాగా ఏడో ప్లేస్‌కు పడిపోయాడు. ఐడెన్‌ మార్క్రమ్‌ (757), డేవిడ్‌ మలాన్‌ (728), ఆరోన్‌ ఫించ్‌ (716), డెవాన్‌ కాన్వే (703), పథుమ్‌ నిస్సంక (661), మార్టిన్‌ గప్తిల్‌ (658), డెస్సెన్‌ (658) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ 17, రోహిత్ శర్మ 19 ర్యాంక్‌ల్లో కొనసాగుతుండగా.. ఐర్లాండ్ సిరీస్‌లో రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన దీపక్ హుడా ఏకంగా 414 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఐర్లాండ్‌తో రెండోటీ 20 మ్యాచ్‌లో 77 పరుగులు చేసిన సంజుశామ్సన్‌ 144వ ప్లేస్‌లో నిలిచాడు. ఇక బౌలర్ల జాబితాలో పేస్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ 37వ స్థానం నుంచి 33వ స్థానానికి ఎగబాకాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..