Afghanistan: తాలిబన్లకు మద్దతు పలికిన షాహిద్ అఫ్రిది.. పాకిస్తాన్ నెక్ట్ పీఎం అంటూ నెటిజన్ల ట్రోల్స్

ఆఫ్గనిస్తాన్‌లో తాలిజన్ల హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మద్దతు పలకడం నెటిజన్లలో ఒక వర్గానికి నచ్చలేదు.

Afghanistan: తాలిబన్లకు మద్దతు పలికిన షాహిద్ అఫ్రిది.. పాకిస్తాన్ నెక్ట్ పీఎం అంటూ నెటిజన్ల ట్రోల్స్
Shahid Afridi
Follow us
Venkata Chari

|

Updated on: Aug 31, 2021 | 6:08 PM

Afghanistan: ఆఫ్గనిస్తాన్‌లో తాలిజన్ల హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మద్దతు పలకడం నెటిజన్లలో ఒక వర్గానికి నచ్చలేదు. తాలిబన్లు పొరుగు దేశంలో సానుకూలతకు ప్రయత్నిస్తున్నారని, మహిళలకు అవకాశాలు ఇస్తున్నారని, అలాగే క్రికెట్‌ని ఇష్టపడుతున్నారని పేర్కొంటూ పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది తాలిజన్లకు బహిరంగంగా మద్దతు పలికాడు. అలాగే ‘రాడికలైజేషన్’, ‘తాలిబాన్ ప్రీమియర్ లీగ్’ వంటి పదాలను ఉపయోగించడంతో పలు వివాదాలకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఒక నెటిజన్ షాహిద్‌ని ‘తాలిబన్ ప్రేమికుడు’ అని కామెంట్ చేశాడు. మానవత్వం, మహిళల స్వేచ్ఛకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న తాలిబన్‌లకు మద్దతు పలుకుతూ అఫ్రిది ప్రకటన చేయడంతో నెగిటివ్ కామెంట్లతో బాగా ట్రోల్ చేశారు. ‘తాలిబన్ క్రికెట్ టీమ్’, ‘తాలిబన్ ప్రీమియర్ లీగ్’ అంటూ అఫ్రిది చేసిన ప్రకటనపై కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాంటి మ్యాచ్‌లు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో నడుస్తాయంటూ విమర్శలు గుప్పించారు.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికార ప్రతినిధి తాలిబన్ పాకిస్తాన్ నుండి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చేసిన ప్రకటన సంచలనగా మారింది. దీనిపై ఒక నెటిజన్ అఫ్రిదిని ట్రోల్ చేశాడు. అఫ్రిదినీ ‘పాకిస్తాన్ తదుపరి ప్రధాని’ అంటూ పిలిచాడు.

అలాంటి ప్రకటన చేయడానికి ముందు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ స్టార్ రషీద్ ఖాన్‌తో అఫ్రిది మాట్లాడాడా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. తాలిబన్ మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అఫ్రిది చేసిన ప్రకటనతో మరొకరు విభేదించారు. ఒకవేళ తాలిబన్లు నిజంగా అంత మంచివారైతే, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లకు అప్పగించాలని ఒక నెటిజన్ చమత్కరించాడు.

పాత్రికేయులతో షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ, “తాలిజన్లు చాలా సానుకూల మనస్తత్వంతో ఉన్నారు. ఇంతకు ముందు వారిని ఇలా చూడలేదు. మహిళలు పని చేసేందుకు వారు ఒప్పుకున్నారు. రాజకీయాలు, ఇతరత్రా ఉద్యోగాలు చేసేందుకు ఒప్పుకున్నారు”. దీంతో నెటిజన్లు దారుణంగా ట్రోట్ చేయడం మొదలుపెట్టారు.

Also Read: IPL 2021: ‘ఈ స్టంట్‌ పేరు జాన్ సేనా.. నా పేరు సురేష్ రైనా’ అంటోన్న సీఎస్‌కే ప్లేయర్.. నెట్టింట్లో దూసుకపోతోన్న డబ్ల్యూడబ్ల్యూఈ వీడియో

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో కాంస్యం గెలిచిన సింఘరాజ్ అధనా.. 8కి చేరిన పతకాల సంఖ్య

IND vs ENG: సిరీస్ తర్వాత ఆ స్టార్ బౌలర్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? ఇప్పటికే వన్డే, టీ20లకు గుడ్‌బై

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం